Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
- ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు
- ప్రభాకర్ రావు తరఫున సి.నిరంజన్ రెడ్డి వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు తరఫున సి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని హైకోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ప్రభాకర్ రావు వెంటనే హైదరాబాద్ తిరిగొస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. ప్రభాకర్ రావు 30ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు.
Also Read:Kerala: పహల్గామ్ దాడిపై రెచ్చగొట్టే పోస్ట్ చేసిన “ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్” నేత..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఎంతో విధేయతతో పనిచేయడం వల్ల అనేక గుర్తింపులు దక్కాయన్నారు. ప్రభాకర్ రావు 65ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు న్యాయవాది.. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ప్రభాకర్ రావుకు సైతం ముందస్తు బెయిల్ మంజూరుచేస్తే దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజకీయ కక్ష్య సాధింపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారని ప్రభాకర్ రావు న్యాయవాది తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నది అవాస్తవమని ప్రబాకర్ రావు న్యాయవాది వెల్లడించారు.
Also Read:Pakistan: బలూచిస్తాన్‌లో ఆట మొదలైంది.. ఏడుగురు పాక్ సైనికులు హతం..
పోలీసుల తరఫున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు. 65ఏళ్ల వయసుందన్న సాకుతో దర్యాప్తు నుంచి తప్పించుకోలేరన్నారు లూద్రా. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పూర్తి ఆధారాలున్నాయని.. హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసి నీళ్లలో పడేస్తే వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారని లూద్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని లూద్రా కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణ 29వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!