తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. ఈనెల 26 నుంచి రేషన్ కార్డుల మంజూరుకు సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. అర్హత ప్రమాణాల పరిశీలనకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలుపైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శుక్రవారం) రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జనవరి 3న సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా టీచర్స్ డే నిర్వహించాలని ఉత్తర్వుల్లో తెలిపింది.
సిద్ధిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్‌లో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చలికాలంలో విద్యార్థులు వేడినీళ్లు రాక, దుప్పటి రాక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గత నాలుగు నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదు అని అన్నారు కానీ..…
TS High Court: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల, హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన శైలజ, ప్రవీణ్ ఘటనలపై పూర్తి వివరాలను న్యాయస్థానానికి పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ అందజేశారు.
ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు కానుంది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు. మంత్రిగా ఏడాదిలోపే మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటుకు కృషి చేశారు.
త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు మొదలు కానున్నాయి.
మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీ డెవలప్మెంట్ పైన పార్లమెంట్‌లో ఒక ప్రశ్న లేవనెత్తాము.. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నామని రాష్ట్రం చెప్పిందని కేంద్రమంత్రి చెప్పారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిందని హరీష్ రావు ఆరోపించారు.
తెలంగాణలో మరొక ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
TGPSC Group 3 Exams: తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి గ్రూప్-3 నియామక పరీక్ష జరగనుంది. ఇప్పటికే అధికారులు గ్రూప్-3 పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/సీపీలతో ఇప్పటికే సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.