తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టెంపుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సోమాజిగూడలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఈటల ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల పరీక్షకు గ్యాప్ ఇవ్వమని అడిగితే గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారని పేర్కొన్నారు.
IAS Officers Transferred: రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందే.. పలువురు జిల్లా ఎస్పీలు, ఆ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు.
ఉస్మానియా హాస్పటల్ నిర్మాణంపై మరోసారి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఉన్న స్థలంలోనే ఉస్మానియా హాస్పటల్ నిర్మిస్తామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Telangana BJP: నేడు ఇందిరా పార్కు, ధర్నా చౌక్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ..
ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు.
"జయ జయహే తెలంగాణ" గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది.
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
వరివేస్తే ఉరి అన్నది మీరు కాదా.. అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్, కేసీఆర్ ను ప్రశ్నించారు. సన్నాల సాగు చేయాలని తర్వాత రైతుల నడ్డి విరిచింది మీరు కాదా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.