త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు మొదలు కానున్నాయి. ఇదిలా ఉంటే.. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయనున్నారు. అలాగే.. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
Read Also: Sambhal Jama Masjid: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘సంభాల్ జామా మసీద్’’ వివాదం..
కాగా.. రాష్ట్రంలో కుల గణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి అనుగుణంగానే కుల గణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న కమిషన్ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కొత్త కమిషన్ చైర్మన్, సభ్యులపై సీఎం రేవంత్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. త్వరలో కొత్త కమిషన్‌ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పారు. దీంతో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. ఎన్నికలకు 15 రోజుల ముందుగా షెడ్యూల్ వెలువడుతుంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు జరుగనున్నాయి.
Read Also: Tirupati Laddu Controversy: శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..! దూకుడు పెంచిన సిట్