TS High Court: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల, హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన శైలజ, ప్రవీణ్ ఘటనలపై పూర్తి వివరాలను న్యాయస్థానానికి పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ అందజేశారు. 2023, 2024లో ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్ లో విద్యార్థులకు పెట్టె ఆహారం.. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్న పాటించడం లేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు పాటించక పోవడం వలనే స్టూడెంట్స్ ఈ ఫుడ్ ఫాయిజన్ ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారని వాదించారు.
Read Also: Silk Smitha : సౌత్ క్వీన్ సిల్క్ స్మిత బయోపిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్..
ఇక, వరుసగా జరిగిన సంఘటనలపై రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి కూడ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారం నాటికి కి వాయిదా వేసింది. అలాగే, మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై కూడా న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో రాష్ట్ర సర్కార్ నివేదిక అందజేసింది. నివేదికపై వాదనలు వినిపించడానికి పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ సమయం కోరారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణ సైతం వచ్చే గురువారం నాటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.