మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీ డెవలప్మెంట్ పైన పార్లమెంట్‌లో ఒక ప్రశ్న లేవనెత్తాము.. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నామని రాష్ట్రం చెప్పిందని కేంద్రమంత్రి చెప్పారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిందని హరీష్ రావు ఆరోపించారు. భూసేకరణ చట్టం వచ్చింది 2013లో అయితే.. రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది కేంద్రం అని అన్నారు. దానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో కేసీఆర్ మార్పులు చేసారు.. 2013 చట్టానికి లోబడి ఇంకా మెరుగైన చట్టాన్ని 2014లో తీసుకుని వచ్చామని హరీష్ రావు తెలిపారు. మరోవైపు.. PN, PD నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఇళ్లు కూల్చాలని హరీష్ రావు అన్నారు. పేదల ఇల్లు కూల్చి డబుల్ బెడ్ రూంలలో పడేస్తున్నారు.. పాత ఇంటికి విలువ కట్టాలి.. దాని నెట్ వాల్యూకి రెండింతలు ఇవ్వాలని హరీష్ రావు పేర్కొన్నారు. ఒక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇవ్వాలి.. వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేసి డబుల్ బెడ్ రూం ఇవ్వాలి.. 18 ఏళ్లు దాటిన వారికి 5లక్షలు ఇవ్వాలి.. 250 గజాల స్థలం ఇవ్వాలని తెలిపారు.
Read Also: Supreme Court: పరస్పర అంగీకారంతో.. లైంగిక సంబంధం నేరం కాదు..
కూల్చిన హైడ్రా ఇళ్ళ సంగతి ఏమిటి..? అని హరీష్ రావు ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్ సమాధానం చెప్పాలి.. చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటాను అంటే కూడా కనికరించలేదని పేర్కొన్నారు. పేదలు అనుభవించిన బాధకు కంపెన్సేషన్ ఇస్తారా అని దుయ్యబట్టారు. వారికి ఏం సమాధానం చెప్తారు.. వారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. అగమాగాం చేసి పేదల ఇల్లు కూల్చేశారు.. తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా అన్నాడు రేవంత్.. సోనియా గాంధీ తెచ్చిన భూసేకరణ చట్టం అమలు చెయ్యి అని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి అందరినీ మోసం చేస్తున్నారని తెలిపారు. ఇదే అంశం పై బహిరంగ చర్చకు సిద్ధం.. ఎక్కడికైనా వస్తానని చెప్పారు.
Read Also: Payyavula Keshav: అనంతపురం జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నాం!
తమపైన బుల్డోజరింగ్ చెయ్యడం కాదు చర్చకు రెడీ.. రండి అని హరీష్ రావు సవాల్ విసిరారు. అఖిలపక్ష సమావేశం పెట్టమని అడిగాం.. ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో సురేష్ రెడ్డి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు.. చట్టబద్ధంగా పేదలకు రావాల్సిన నష్టపరిహారంపై కోర్టుకి వెళ్తామని అన్నారు. వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని హరీష్ రావు తెలిపారు. తాము చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో కూడా నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చాము.. 95 శాతం న్యాయం చేసాము.. ఎక్కడో ఒక దగ్గర 5శాతం.. అది కూడా లీగల్ ఇష్యూలలో ఆగిందని హరీష్ రావు పేర్కొన్నారు.