TGPSC Group 3 Exams: తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి గ్రూప్-3 నియామక పరీక్ష జరగనుంది. ఇప్పటికే అధికారులు గ్రూప్-3 పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/సీపీలతో ఇప్పటికే సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ గ్రూప్-3 పరీక్షలకు దాదాపు 5.36 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను కేటాయించారు. 1375 పోస్ట్ లకు రేపు, ఎల్లుండి నియామక పరీక్ష జరగనుంది. రేపు రెండు పేపర్లు, ఎల్లుండి ఒక పేపర్ కు ఎగ్జామ్ ఉండనుంది.
Read Also: Falcon-9 Rocket: ఎలాన్ మస్క్ రాకెట్ ద్వారా భారత ‘జీశాట్-20’ శాటిలైట్ ప్రయోగం..
కాగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు మొదటి సెషన్‌లో భాగంగా ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష ఉండనుండగా.. రెండో సెషన్‌లో పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. అలాగే, ఈ నెల 18న పేపర్-3 పరీక్షను ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు క్లోజ్ చేయనున్నారు. ఆ తరవాత వచ్చిన వారికి నో ఎంట్రీ. ఉదయం సెషన్ పరీక్షలకు 9.30 గంటల లోపు.. మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 2.30 గంటలలోపు అభ్యర్థులు పరీక్ష కేంద్రం లోపలికి చేరుకోవాలని టీజీపీఎస్సీ వెల్లడించింది.