ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు కానుంది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు. మంత్రిగా ఏడాదిలోపే మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటుకు కృషి చేశారు. మల్లంపల్లి ప్రాంత ప్రజల పదేళ్ల ఆకాంక్షను మంత్రి సీతక్క నెరవేర్చారు. కాగా.. కొత్తగా మల్లంపల్లి మండల ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు సీతక్క ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Telangana: త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్.. ఎన్నికలెప్పుడంటే..?
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మల్లంపల్లి ప్రత్యేక మండలం కోసం ప్రజల 10 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి మల్లంపల్లి మండల ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండలం కోసం అలుపెరగని పోరాటం చేసి మండలాన్ని సాధించుకున్న మల్లంపల్లి ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే మల్లంపల్లి మండలం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మల్లంపల్లి ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. త్వరగా జీవో రావడానికి కృషి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీతక్క కృతజ్ఞతలు చెప్పారు.
Read Also: Delhi: అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు.. మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ