జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరుగుతాయి. శుభ్‌మాన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఇంగ్లాండ్‌కు బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నాడు. ఈ పర్యటనలో భారత్ గెలవడం కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు చాలా అవసరం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి WTC ఫైనల్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది. దాంతర్వాత భారత్ ఆడబోయే టెస్ట్ సిరీస్ ఇదే కావడంతో ఇంగ్లాండ్ టెస్ట్ గంభీర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.
Also Read:Allu Arjun -NTR – Ram Charan: ముగ్గురు మొనగాళ్లు.. తెలియకుండానే చేస్తున్నారా?
నెట్స్‌లో ఆటగాళ్లకు కఠోర శిక్షణనిస్తున్నాడు. ఈ సెషన్ లో గంభీర్, రిషబ్ పంత్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ పై రిషబ్ పంత్ కు మంచి ట్రాక్ రికార్డుంది. ఇంగ్లాండ్ తో ఆడిన 12 మ్యాచ్‌లు, 21 ఇన్నింగ్స్‌లలో 781 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ,4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ పిచ్ లపై పంత్ కు మంచి అవగాహన ఉంది. పైగా ఈ సిరీస్ లో సీనియర్ ప్లేయర్లు లేకపోవడంతో జట్టు విజయ అవకాశాలు పంత్ పైనే ఆధారపడి ఉన్నాయి.
Also Read:Mangli Party Issue: మంగ్లీ కేసు FIR కాపీ.. కీలక విషయాలు వెలుగులోకి!!
ఈ సిరీస్ గెలుపుపై గిల్ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ తన కెప్టెన్సీపై ఆందోళన వ్యక్తమవుతోంది. పటిష్ట ఇంగ్లాండ్ జట్టుపై ఆధిపత్యం చూపించాలంటే ఆటతో మాత్రమే కాదు కెప్టెన్ గానూ సక్సెస్ అవ్వాలి. అయితే పంత్ డిప్యూటీ కావడంతో గిల్ పై కాస్త భారం తగ్గినట్లే అని చెప్పవచ్చు. పంత్ నుంచి సలహాలు తీసుకోవడానికి గిల్ వెనుకాడక పోవచ్చు. ఏదేమైనా ఈ పర్యటనలో అందరి దృష్టి రిషబ్ పంత్ పైనే ఉంది.మరోవైపు బెన్ స్టోక్స్ కూడా పంత్ నే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పంత్ ని త్వరగా అవుట్ చేస్తే.. ఆల్మోస్ట్ మ్యాచ్ టర్న్ అవుతుందని స్టోక్స్ భావిస్తున్నాడట.