Virat Kohli: క్రికెట్ ప్రియులు ఎంతగానో అభిమానించే క్రికెటర్ కింగ్ కోహ్లీ.. విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారని మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ 2026 లో టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావచ్చు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఫార్మెట్‌లోకి విరాట్ రీఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా ఒక మ్యాజిక్ జరగాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా.. గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచింగ్ పదవిని కోల్పోపోవడం. అవును కింగ్ కోహ్లీ ఈ ఫార్మెట్‌లోకి గంభీర్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నప్పుడే రావచ్చని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెస్ట్ క్రికెట్‌లో గౌతమ్ గంభీర్ వైఫల్యాల పరంపర కారణంగా ఆయనను ఈ ఫార్మెట్‌లో కోచ్ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే జరిగితే, విరాట్ ఈ ఫార్మెట్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
READ ALSO: Aadi Sai Kumar : సాయికుమార్ ఇంట అంబరాన్నంటిన సంబరాలు.. మరోసారి తండ్రి అయిన ఆది
విరాట్ కోహ్లీ పునరాగమనం గురించి జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడాడు. ఈ సంవత్సరం విరాట్ తిరిగి జట్టులోకి రావచ్చని పేర్కొన్నాడు, కానీ ఇది జరగాలంటే గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచ్ పదవి నుంచి నిష్క్రమణ తప్పనిసరి అని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గౌతమ్ గంభీర్ – విరాట్ కోహ్లీ మధ్య ఏదో సరిగ్గా లేదు, వారు మాట్లాడుకోవడం లేదనిపిస్తుంది. ఈ కారణాలతోనే బహుశా విరాట్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడేమో అని వివరించాడు. విరాట్ కోహ్లీని తిరిగి ఈ ఫార్మెట్‌లోకి తీసుకురాడానికి ఏదైనా మార్గం ఉందంటే అది, కొత్త టెస్ట్ కోచ్ రాక మాత్రమే అని వెల్లడించాడు.
టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ గత ఏడాది మే 12న రిటైర్ అయిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం విరాట్ అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులను కూడా ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌ల్లో 30 సెంచరీలు,31 హాఫ్ సెంచరీలతో సహా 9,230 పరుగులు చేశాడు. ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ టెస్ట్ కెరీర్ 14 సంవత్సరాల పాటు కొనసాగింది, విరాట్ భారతదేశపు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్లలో ఒకడు. ఇప్పుడు గనుక విరాట్ తిరిగి ఈ ఫార్మెట్‌లోకి ఎంట్రీ ఇస్తే, మనోడు టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగుల మైలు రాయిని చేరుకోగలడు.
READ ALSO: US Venezuela Conflict: వెనిజులాపై బాంబులతో విరుచుకుపడిన అమెరికా..