IND vs Sa Test: కోల్‌కతాలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో 159 రన్స్ కే ఆలౌట్ అయింది. భారతపేస్ దళ నాయకుడు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో.. సఫారీ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 రన్స్ తో జట్టు టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి బవుమా కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరుగులు మినహా మిగతా ప్లేయర్స్ పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులే చేసింది. 93/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా కాసేపటికే 8వ వికెట్ కోల్పోయింది.
Read Also: Prashant Kishor: వరల్డ్ బ్యాంక్ డబ్బుతో గెలిచారు.. ఎన్డీయేపై ప్రశాంత్ కిషోర్ పార్టీ ఆరోపణ..
అయితే, బవుమా మాత్రం తన బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకు పోయాడు. బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి.. 122 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక, ప్రొటిస్ ఇన్నింగ్స్ 54వ ఓవర్ మూడో బంతికి సిసైమన్ హార్మర్‌ను రాజ్ బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో చివరి బంతికి డీఎస్పీ సిరాజ్ కేశవ్ మహరాజ్ డకౌట్ చేయడంతో సెకండ్ ఇన్సింగ్స్ లో 153 పరుగులకే సఫారీ జట్టు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో 123 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా.. భారత జట్టుకు 124 పరుగుల టార్గెట్ ఇచ్చింది. కాగా, ప్రోటీస్ జట్టును కట్టడి చేయడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించారు. కీలకమైన నాలుగు వికెట్లు తీసుకున్నాడు జడేజా. సిరాజ్ మియా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు.