Newtons 3rd Law OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీకి సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Newtons 3rd Law OTT Release: హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ 3వ లా’ (Newton’s 3rd Law). 2026 జూలై 31న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది ఈ మూవీ. ‘ప్రతి చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అనే న్యూటన్ మూడవ నియమం లాగే, మనుషులు చేసే తప్పులకు కర్మ (కర్మ సిద్ధాంతం) ఎలా రియాక్ట్ అవుతుందో ఈ క్రైమ్ థ్రిల్లర్ లో చాలా ఆసక్తికరంగా చూపించారు. అయితే థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్దమౌతోంది. ఈ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను ఎప్పుడు ? ఎక్కడ చూడచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ETV Winలో స్ట్రీమింగ్
రాజేష్ కర్ణ దర్శకత్వంలో రూపొందిన ‘Newton’s 3rd Law’ జూలై 31న థియేటర్లలో విడుదలై, నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం 2026 ఆగస్టు 27 నుంచి ETV Win వేదికగా స్ట్రీమింగ్ కానుందని ఆ సంస్థ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ థ్రిల్లర్‌ను చూసే అవకాశం దక్కనుంది. ఈ చిత్రంలో సుమంత్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా తన నటనతో ఆకట్టుకోగా, సీనియర్ నటుడు జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, త్రినాథ్ వర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు । హరీష్ కోహిర్కర్ నిర్మించిన ఈ చిత్రానికి సింజిత్ యెర్రమిల్లి అద్భుతమైన థ్రిల్లింగ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
సినిమా కథ
ఈ కథ 1999 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక మిస్టరీ డబుల్ మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. నగరంలో ఒక కాలేజీ విద్యార్థి భవనం పైనుండి పడి మరణించగా, అదే రాత్రి ఒక ఒంటరి తల్లి కారు ప్రమాదంలో చనిపోతుంది. ఈ రెండు వేర్వేరు సంఘటనల వెనుక ఏదో బలమైన కనెక్షన్ ఉందని నమ్మిన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్), ఆ కేసును చేధించే క్రమంలో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడనేదే ఈ సినిమా. “ప్రతి చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది” అనే న్యూటన్ మూడవ నియమం లాగే.. మనుషులు చేసే తప్పులకు కర్మ (కర్మ సిద్ధాంతం) ఎలా రియాక్ట్ అవుతుందో ఈ క్రైమ్ థ్రిల్లర్ లో చూపించారు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!