Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhari: మోస్ట్ అవేటెడ్ హై-ఇంటెన్సిటీ యాక్షన్ రివెంజ్ హిందీ మూవీ ‘గాంధారి’ (Gandhari)లో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను మరోసారి సవాల్‌తో కూడిన ఇంటెన్స్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్, పురాణ స్ఫూర్తితో వస్తున్న ఈ సినిమాలో తాప్సీ కళ్లకు గంతలు కట్టుకుని చేసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మహాభారతంలోని గాంధారి పాత్ర భారతీయ ఇతిహాసంలో అత్యంత సంక్లిష్టమైన పాత్రలలో ఒకటి. అంధుడైన భర్త ధృతరాష్ట్రుడి జీవితాన్ని పంచుకోవాలనే సంకల్పంతో ఆమె తన కళ్లకు స్వయంగా గంతలు కట్టుకోవడం త్యాగానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు అదే పాత్రలోని ఆధునిక కోణంలో చూపించేందుకు దర్శకుడు దేవాశిష్ మఖిజా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమూవీ థియేటర్ల గడప తొక్కకుండానే ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. ఎందులో చూడచ్చు ? ఎప్పుడు చూడచ్చు ? అనే విషయాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
ఏ ఓటీటీలో అంటే ?
‘గాంధారి’ (Gandhari) మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ఫామ్ లో నేరుగా విడుదల కాబోతోంది. ప్రముఖ రచయిత్రి కనికా థిల్లాన్ కథ అందించి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతంలోని గాంధారి పాత్ర స్ఫూర్తితో తాప్సీ పన్ను ఈ సినిమాలో ఎక్కడా డూప్ వాడకుండా, కళ్లకు గంతలు కట్టుకుని పోరాడే అత్యంత విలక్షణమైన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రదర్శించడం సినిమాకు అతిపెద్ద హైలైట్ కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇంకా రిలీజ్ డేట్ ను ఆఫీషియల్ గా ప్రకటించలేదు. ఈ హై-ఇంటెన్సిటీ యాక్షన్ రివెంజ్ డ్రామా సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే పూర్తయి, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా వస్తున్న ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్‌ను రాబోయే కొద్ది వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా 2026 చివరికల్లా నేరుగా ఆన్లైన్లో విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
కథ
‘గాంధారి’ (Gandhari) సినిమా కథ కిడ్నాప్ చేయబడిన తన కన్నబిడ్డను రక్షించుకోవడం కోసం ఒక సామాన్య తల్లి వ్యవస్థపై తిరుగుబాటు చేసే అత్యంత ఇంటెన్స్ రివెంజ్ డ్రామా. మహాభారతంలోని గాంధారి పాత్ర స్ఫూర్తితో రూపొందుతున్న ఈ ఆధునిక కథాంశంలో, తాప్సీ పన్ను ఎక్కడా డూప్ వాడకుండా కళ్లకు గంతలు కట్టుకుని, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్‌లో నటించారు. తన బిడ్డను దక్కించుకునే క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు, ఆపదలు, శత్రువుల ఆట కట్టించడానికి ఆమె ఎంతటి సాహసాలకు తెగించిందనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశం. ఈ యాక్షన్ సీక్వెన్స్ కి ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిందీ చిత్రసీమలో లేడి ఓరియెంటెడ్ పాత్రల్లో సత్తా చాటుతున్న తాప్సీకి ఈ సినిమా ఎలాంటి లైఫ్ టర్న్ ఇస్తుందో చూడాలి. తాప్సి ఇంటెన్స్ యాక్షన్ చూడాలనుకుంటే, మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?