ఇవాళ్టి నుంచి ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’కు రెడీ అయింది. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈఓలో పాల్గొనే ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్, తూర్పు తిమోర్ అధ్యక్షుడు జోస్ రమోస్–హోరాట, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ నుయిసీలతో ఆయన నిన్న వేర్వేరుగా భేటీ అయ్యారు. కాగా, ఆయా దేశాలతో సంబంధాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అంతకుముందు యూఏఈ అధ్యక్షునికి విమానాశ్రయంలో మోడీ స్వాగతం పలికారు. ఆయనతో కలిసి సదస్సు ప్రాంగణం దాకా భారత ప్రధాని రోడ్ షో నిర్వహించారు.
Read Also: IND vs ENG: భారత గడ్డపై ఇంగ్లండ్ గెలవాలంటే.. ముందుగా అతడిని ఆపాల్సిందే!
కాగా, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, పరిశ్రమ వర్గాల ప్రతినిధులతోనూ మోడీ సమావేశం అయ్యారు. భారత్ పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి తెలియజేశారు. అయితే, డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయమ్, మైక్రాన్ టెక్నాలజీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్ మెహ్రోత్రాత, డియాకిన్ యూనివర్సిటీ వీసీ ఇయాన్ మారిటెన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకీతో పాటు ఇతరులు పాల్గొన్నారు. గాంధీనగర్‌లో ‘వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో–2024’ను మోడీ ప్రారంభించారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సు నేపథ్యంలో 2 లక్షల చదరపు మీటర్లలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.