విజయవాడలోని గొల్లపూడిలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ విభాగాల యూనిట్ టేబుల్ క్యాలెండర్‌ను దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ సుసర్ల శ్రీనివాసరావు తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇద్దరు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కుటుంబాలు సైకిల్ దిగాయి. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఇంత జాప్యానికి కారకులు ఎవరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన.. ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి బీహెచ్ఈఎల్ అధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్‌పై సమీక్షించారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి రెండు యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో మూడు యూనిట్లు పూర్తి చేసుకొని మొత్తం 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణం ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉండటానికి…
వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2పై సమావేశంలో చర్చించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనేదానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్యచికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
మొయినాబాద్ యువతి మర్డర్ ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సీరియస్ అయ్యారు. కేసులో నిర్లక్ష్యం వహించినందుకు హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. సీఐ రాంబాబుకు మెమో జారీ చేశారు. యువతి మిస్సింగ్ మీద బాధితులు ఫిర్యాదు చేయటానికి రాగా.. ఎస్సై శివ నిర్లక్ష్యం వహించాడు. దీంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. బాకరం గ్రామ పరిధిలో సోమవారం రోజు మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహం ఘటన హత్య కాదు.. ఆత్మహత్య అని…
కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు లోకేష్‌ను కలిశారు. కేశినేని నాని పార్టీ వీడిన తర్వాత జరుగుతోన్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది.
తిరుమలలో మరో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ కెమెరా సాయంతో అసోంకు చెందిన ఆర్మీ కమాండర్, అతని భార్య కలిసి తిరుమల కొండలను వీడియో తీశారు.
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్ లో ఉండదని అన్నారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. ఇకపై పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందన్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని తెలిపారు. బీఆర్ఎస్ కు బీజేపీ బీ…
తెలంగాణ రాష్ట్రంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝులిపించేందుకు రవాణా శాఖ సిద్దమవుతుంది. విజయవాడ, వైజాగ్, బెంగుళూరు రూట్స్ లో ఎక్కువ వసూలు చేస్తున్నట్టు తెలిసింది.. అందుకే స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టామని జాయింట్ ట్రాన్ పోర్ట్ కమిషనర్ రమేష్ అన్నారు. అందులో 79 బస్సుల పైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటిల్లో రూ.35 వేల జరిమానా కూడా విధించినట్లు ఆయన పేర్కొన్నారు.