Lowest Home Loans: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీకే హోం లోన్ అందిస్తున్న టాప్ 5 బ్యాంకులు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lowest Home Loan Interest Rates: దేశంలోని చాలా మందికి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లో సొంత ఇల్లు కొనడం చాలా మందికి ఒక కల. కలను సహకారం చేసుకునేందుకు పెరుగుతున్న ఇళ్ల ధరల కారణంగా చాలా మంది హోం లోన్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే తక్కువ వడ్డీతో హోం లోన్ ఎక్కడ దొరుకుతుంది? ఏ బ్యాంక్‌లో ఈఎంఐ తక్కువగా ఉంటుంది? అనే ప్రశ్నల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. వీటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి.. గతేడాది రిజర్వ్ బ్యాంక్ రిపో రేటును గణనీయంగా తగ్గించిన తర్వాత, ప్రభుత్వ రంగ బ్యాంకులు హోం లోన్ వడ్డీ రేట్లను బాగా తగ్గించాయి. ప్రస్తుతం కొన్ని పీఎస్‌యూ బ్యాంకులు 7.10 శాతం నుంచే హోం లోన్‌లు ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా హోం లోన్‌ను 7.10 శాతం ప్రారంభ వడ్డీతో అందిస్తోంది. 30 లక్షల నుంచి 75 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకుంటే వడ్డీ 7.10 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. 75 లక్షలకుపైగా లోన్ అయితే వడ్డీ 7.10 నుంచి 10.25 శాతం వరకు ఉంటుంది.
READ MORE: Anil Ravipudi: హీరో ఎవరైనా సరే, కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ!
Also Read
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
- JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ఎంట్రీ..
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా 7.10 శాతం వడ్డీతో హోం లోన్ ఇస్తోంది. 30 లక్షల నుంచి 75 లక్షలకుపైగా లోన్‌లకు 7.10 నుంచి 9.15 శాతం వరకు వడ్డీ వర్తిస్తుంది. లోన్ మొత్తం ఎంతైనా ప్రారంభ వడ్డీ తక్కువగానే ఉండటం ఈ బ్యాంక్ ప్రత్యేకత. యూకో బ్యాంక్‌లో 30 లక్షల నుంచి 75 లక్షలకుపైగా హోం లోన్‌లకు 7.15 నుంచి 9.25 శాతం వరకు వడ్డీ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అయితే అన్ని కేటగిరీల హోం లోన్‌లకు 7.10 శాతం నుంచి ప్రారంభమై గరిష్టంగా 9.90 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోం లోన్ వడ్డీ 7.90 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో 7.65 శాతం నుంచి హోం లోన్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్‌లో మాత్రం వడ్డీ కొంచెం ఎక్కువగా ఉండి సుమారు 8.35 శాతం నుంచి ప్రారంభమవుతుంది. మొత్తంగా చూస్తే, ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో హోం లోన్ వడ్డీ ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే తక్కువగా ఉంది. తక్కువ ఈఎంఐతో దీర్ఘకాలానికి ఇల్లు కొనాలనుకునేవారికి పీఎస్‌యూ బ్యాంకులు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?