అఫ్ఘనిస్థాన్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొహాలి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 17.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 159 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్ లో శివం దూబే అర్ధసెంచరీతో చెలరేగాడు. 60 పరుగుల…
ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు.
ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలోనే కీలక మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. నియోజకవర్గాల్లో బలమైన ఇంఛార్జులను నియమించే పనిలో పడ్డారు. తాజగా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పులపై వైసీపీ మూడో జాబితాను విడుదల చేసింది.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ (పీఎస్ఐఎల్-24) కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు. అంతేకాకుండా.. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం, సుసంపన్నం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల…
ధరణిలో సమస్యల పరిష్కారంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. పోర్టల్ ప్రక్షాళనపై కమిటీ చర్చించారు. ధరణిలో భూముల సమస్యలు చాలా ఉన్నాయని కమిటీ తెలిపింది. సీసీఎల్ఎ కార్యాలయం వేదికగా కమిటీ పనిచేస్తోందని చెప్పారు. వారం రోజుల్లో కమిటీ మళ్లీ సమావేశం అవుతుందని అన్నారు. ఆన్ లైన్ లో చాలా భూములు ఎక్కలేదని.. సన్నకారు, చిన్నకారు రైతులు గుంట భూమి అమ్మడానికి ఇబ్బంది పడ్డారన్నారు. గతంలో తప్పులు పునరావృతం కాకుండా…
ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. రాష్ట్రాలకు చెందిన లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కో-ఆర్డినేటర్లు పార్టీకి కళ్లు, చెవులు లాంటివారని అన్నారు. మైక్రో లెవల్ లో రాజకీయ, సామాజిక పరిస్థితులు పరిశీలించాలని తెలిపారు.…
ఏపీలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం వైపు పార్టీలు చూస్తున్నాయి. ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.