Kishan Reddy : మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం 100కోట్లు మంజూరు చేశారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
కిషన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకున్న అనంతరం ధారూర్ మండలం కోట్ పల్లి
ప్రాజెక్టులో బోటింగ్ లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో హైదరాబాద్‌కు అత్యంత దగ్గరగా ఉన్న అనంతగిరి అడవుల్లో
పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి భారతదేశంలో ఉన్న సౌకర్యాలు మరే దేశంలోనూ లేవని ఆయన
వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పర్యాటక రంగాన్ని ప్రైవేట్ సెక్టార్ కింద కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పాలసీ
రూపొందించామని ఆయన వెల్లడించారు.
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. తక్కువ పెట్టుబడితో టూరిజంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆదివాసి ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 25 వేల కోట్ల రూపాయలను ఈ కార్యక్రమానికి కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. 45 రోజుల క్రితమే ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందని.. ఆదివాసులకు ఇల్లు నిర్మాణం కోసం నేరుగా నిధులు మంజూరు చేశామన్నారు. ఆధార్, రేషన్ కార్డు, విద్యుత్, అంగన్వాడి భవనం, ఆరోగ్య భద్రత వంటి కార్యక్రమాలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు.
తాజావార్తలు
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క