దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్లు సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై ధర్నా చేస్తున్న సమయంలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు.
గత కొద్ది నెలలుగా పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మాంద్యం కారణంగా తీవ్ర నష్టాల పాలయ్యింది. దీని కారణంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తులు పెరిగి గోదాముల్లో నిలువలు పెరుకుకుపోయాయి. దీంతో పాటు హైదరబాద్ తదితర మార్కెట్లలో ఫాలిస్టర్ వస్త్రాల అమ్మకాలు తగ్గిపోవడంతో కార్మికులకు, వస్త్ర పరిశ్రమ అనుబంధ సభ్యులకు పని కల్పించలేక, సకాలంలో జీతాలు అందించలేక 15వ తేదీ నుండి ఫ్యాక్టరీలను మూసి వేయాలని తలంచారు.. ఈ విషయాన్ని అధికారులు రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖా మంత్రి…
రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. పన్నెండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు.
మణిపూర్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి దశ భారత్ జోడో యాత్ర ద్వారా భారత్ దేశాన్ని ఏక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. దేశంలోని ముఖ్య సమస్యలు, మణిపూర్ లో జరిగిన అల్లర్లపై సమాధానం కోరిన ప్రతిపక్షాలను సభ నుండి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకున్నారన్నారు మల్లు రవి. అంతేకాకుండా.. ప్రజా సమస్యలను అడగకుండా, ప్రశ్నించకుండా అడ్డుకుంటున్న…
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి మొదటి రోజు భోగి సందర్భంగా ఊరూరా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు. ఇక సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతుంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.
రెండు వారాల క్రితం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంత్రావుపల్లి గ్రామంలో హత్యకు గురైన రిటైర్డ్ జవాన్, బీఆర్ఎస్ కార్యకర్త సిహెచ్ మల్లేష్ కుటుంబాన్ని ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మల్లేష్ హత్య రాజకీయ ప్రేరేపితమని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ వాదనను కొట్టిపారేసిన పోలీసులు కుటుంబ ఆస్తి తగాదాల కారణంగానే మల్లేష్ను హత్య చేసినట్లు చెబుతున్నారు. ఈ హత్యలో మల్లేష్ బంధువుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్…
ఏపీ కాంగ్రెస్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన తరుణంలో ఆ స్థానంలో వైఎస్ షర్మిలను నియమించే అవకాశాలున్నాయని సమాచారం.
సంక్రాంతి పండగకు తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ఆరంభమయ్యాయి. ఈ జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయక క్రీడ.. దీంట్లో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది.
డెన్మార్క్ రాణి మార్గరెట్-2 సింహాసనం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్లోని క్రిస్టియన్ బోర్గ్ ప్యాలెస్లో సంబంధిత దస్త్రాలపై ఆమె సంతకం చేశారు. అనంతరం ఆమె పెద్దకుమారుడు ఫ్రెడెరిక్-10ను రాజుగా ప్రకటించారు
టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 15.4 ఓవర్లలోనే చేధించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (68), శివం దూబే (63) అజేయంగా నిలిచి అఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత చూపించారు. లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి సిరీస్ను…