Samajwadi Party: ఉత్తరప్రదేశ్‌లోని 16 లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్‌కు 11 సీట్లు కేటాయించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి, షఫీకర్ రెహమాన్ బార్క్, రవిదాస్ మెహ్రోత్రా వరుసగా సంభాల్, లక్నో నుంచి పోటీ చేయనున్నారు. ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, ఎటా నుంచి దేవేశ్ శాఖ్యా, బదాయు నుంచి ధర్మేంద్ర యాదవ్, ఖేరీ నుంచి ఉత్కర్ష్ వర్మ, దౌర్హరా నుంచి ఆనంద్ బదౌరియా, ఉన్నావ్ నుంచి అను టాండన్, ఫరూఖాబాద్ నుంచి కిషోర్ శాఖ్య, అక్బర్‌పూర్ నుంచి రాజారాం పాల్, బందా నుంచి శివశంకర్ సింగ్ పటేల్, ఫైజాబాద్ నుంచి అవదేశ్ ప్రసాద్, అంబేడ్కర్ నగర్ నుంచి లాల్‌జీ వర్మ, బస్తీ నుంచి రామ్‌ప్రసాద్ చౌదరి, గోరఖ్‌పూర్ నుంచి శ్రీమతి కాజల్ నిషాద్ పోటీ చేయనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది.
Read Also: S Jaishankar: పొరుగు దేశాలపై చైనా ప్రభావం.. భారత్ భయపడాల్సిన అవసరం లేదు..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ మారడం, ఎన్డీయేలో చేరడంతో ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలిక ఏర్పడిన తరుణంలో ఈ ప్రకటన వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో కూడా మమతా బెనర్జీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇండియా కూటమితో సీట్ల పంపకాల చర్చలు విఫలమవుతున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రకటన మంగళవారం కొత్త ఆశ్చర్యానికి దారితీసింది.