భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు దేశ మధ్యంతర బడ్జెట్-2024ను సమర్పించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను మొదట వివరించారు. మాకు మహిళలు, పేదలు, యువకులు, రైతులు ఇలా నాలుగు కులాలు ఉన్నాయని, వారిపైనే దృష్టి సారించామన్నారు.
దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామన్నారు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో గల విగ్రహాల ముందు పూజారి ప్రార్థనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత, అర్ధరాత్రి జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు ప్రారంభమయ్యాయి.
త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 29 దాకా పర్యావరణ…
మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎల్లుండి (శనివారం) ఏలూరులో జరిగే సిద్దం సభకు నియోజక వర్గం నుంచి కార్యకర్తలు, నేతలను పంపే పనికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో.. మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని మైలవరం పరిశీలకులు పడమట సురేష్ బాబు సమావేశమయ్యారు. కాగా.. ఎమ్మెల్యే వసంత హైదరాబాద్ లో ఉన్నారు. సిద్ధం కార్యక్రమానికి అందుబాటులో ఉండనని వసంత కృష్ణ పార్టీ పెద్దలకు ఇప్పటికే…
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25కు సంబంధించిన మధ్యంతర బడ్జె్ట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో 2024 – 25 మధ్యంతర బడ్జెట్ పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2024 – 25 బడ్జెట్ లో ఆంధ్రపదేశ్ కు 9138 కోట్లు కేటాయింపు, 2024- 25 బడ్జెట్ లో తెలంగాణకు 5071 కోట్ల కేటాయింపు చేసినట్లు తెలిపారు. కాజీపెట్ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయని, ఎప్పుడు లేని…
గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.…
మలేషియాలోని దక్షిణ రాష్ట్రమైన జోహోర్కు చెందిన సుల్తాన్ ఇబ్రహీం బుధవారం దేశ 17వ రాజుగా బాధ్యతలు చేపట్టారు. కౌలాలంపూర్లోని నేషనల్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు పేరుతో ప్రతిపాదిత చట్టం.. సెంట్రల్ ఏజెన్సీ పోటీ పరీక్షలు, విశ్వవిద్యాలయ పరీక్షలతో సహా వివిధ పరీక్షలలో అన్యాయమైన పద్ధతుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని రాజ్భవన్లో గవర్నర్కు తన రాజీనామాను సమర్పించిన నిమిషాల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అంతకుముందు బుధవారం సాయంత్రం, భూ కుంభకోణంలో ఏడు గంటలకు పైగా ఈడీ ప్రశ్నించడంతో హేమంత్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.