ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు వచ్చింది. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరు..?…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నందున దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో 2024-25 వార్షిక బడ్జెట్‌కు సంబందించి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రూపొందించిన ప్రతిపాదనల పై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. హైదరాబాద్ మహనగరానికి సంబంధించి నాలుగు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి…
అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం గురించి కీలక అప్డేట్ వచ్చింది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి ఎంక్యూ-9బీ సీ గార్డియన్ డ్రోన్ల అమ్మకానికి యూఎస్ అనుమతినిచ్చింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ రోజు సాధ్యమయ్యే విక్రయాల గురించి యూఎస్ కాంగ్రెస్‌కు తెలియజేస్తుంది.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేద్దామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నఅర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్…
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ తరపున కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అంశాలపై రెండు గంటలు రివ్యూ చేశారన్నారు. పదేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ తో అభివృద్ధి ఆగిపోయిందని, ఎన్నో పనులు మొదలు అయి ఆగిపోయాయన్నారు. RRR అనౌన్స్ చేసినా ఒక్క అడుగు పడలేదన్నారు వెంకట్ రెడ్డి. హైదరాబాద్ విజయవాడ హైవే కు సంబంధించి…
ఈ నెల 3న దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ పార్టీ.. వై నాట్ 175.. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల నినాదం ఇదే.. ఎవరెవరు కలిసినా.. ఎంత మంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా.. తనదే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో.. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సీఎం జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ…
బెజవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య వార్ ముదురుతోంది. టికెట్ తనకు ఇవ్వాలని దుర్గగుడికి ర్యాలీగా వెళ్లి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బల ప్రదర్శన చేయగా.. మైనార్టీలకు ఈ టికెట్ ఇవ్వక పోతే ఉరి వేసుకుంటారో, ఇంకా ఏం చేస్తారో తెలియదని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వార్నింగ్ ఇస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వేధిస్తున్నారంటూ ట్రాక్టర్ డ్రైవర్లు హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ముందు ధర్నాకు దిగారు. నగరంలో వివిధ ప్రాంతాలలో ట్రాక్టర్లు నడుపుతూ జీవనం సాగిస్తున్న తమపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణ సమయంలో కూల్చివేసిన మెటీరియల్ ను ట్రాక్టర్ లలో తాము తరలిస్తుంటామని… ఆ మెటీరియల్ కింద పడకుండా బట్టను కట్టి తీసుకెళ్తుంటామని వివరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ట్రాఫిక్ పోలీసులు తమకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా పర్యటనకు ఏర్పాట్లు చేశారు అధికారులు.…
బడ్జెట్లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన ఉండదు.. ఇది దేశ బడ్జెట్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రాలకు గత బడ్జెట్లో దీర్ఘకాలం పాటు సున్నా వడ్డీతో రుణాలు ఇచ్చారు.. ఇప్పుడు కూడా కేటాయించారని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు నెరవేర్చారని.. ఖచ్చితమైన డెడ్ లైన్ అవసరం లేదన్నారు.