రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆ రెండు హామీల అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. అలాగే.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.
జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిట్ కాయిన్ ట్రేడింగ్‌లో నష్టం రావడంతో సూసైడ్ కు పాల్పడ్డాడు. మృతి చెందిన విద్యార్థి ఓయూలో పీజీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఓయూ క్యాంపస్ హాస్టల్ లో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కోరుట్లకు చెందిన నవీన్ గా గుర్తించారు. కాగా.. బిట్ కాయిన్ ట్రేడింగ్ లో రూ.3 లక్షల వరకు పోగొట్టుకున్నట్లుగా తెలుస్తుంది.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కార్యకర్తలు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. 'సిద్ధం' పోస్టర్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అందులో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది. కాగా.. ఈ బడ్జెట్ లో కేంద్రం ఎంత ప్రకటించిందో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై సీఈఓ ఎంకే మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై సీఈఓ సమీక్ష చేపట్టారు. ఓటర్ల నమోదు, మార్పు చేర్పుల దరఖాస్తుల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఇతర నేతలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. నాగోబాను దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. గత నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడారన్నారు. రేపు దేశంలోనూ ఇదే పరిస్థితి వస్తుంది.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
బెజవాడ పశ్చిమలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలని.. ఇవాళ ర్యాలీ బల ప్రదర్శన కాదు మైనార్టీల వాయిస్ అని ఆయన పేర్కొన్నారు.