IND vs ENG 2nd Test: విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ 336/6తో రెండోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 396 పరుగులకు మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చివరి వరకు అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 101 ఓవర్ వేసిన స్పిన్నర్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాది జైస్వాల్ తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Read Also: Yashasvi Jaiswal: డబుల్ సెంచరీతో కదం తొక్కిన యశస్వీ జైస్వాల్..
జైస్వాల్‌కు తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తొలి ద్విశతకం కావడం విశేషం. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట జైశ్వాల్ తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైస్వాల్ ఔటయ్యాడు. అండర్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి జైస్వాల్ తన వికెట్‌ను కోల్పోయాడు. 8వికెట్‌గా జైస్వాల్ వెనుదిరగగా.. కాసేపటికే మరో రెండు వికెట్లు కోల్పోయి 396 పరుగుల వద్ద భారత్ ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లు బషీర్, అహ్మద్, అండర్‌సన్‌లకు తలో 3 వికెట్లు తీశారు.