Home
Telugu News
Telugu News News
-
MP K.Laxman : రాష్ట్రపతి ప్రసంగం కొత్త ఒరవడికి నాంది పలికింది
రాష్ట్రపతి ప్రసంగం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలు అనాలోచితంగా విమర్శలు చేస్తున్నారని, ఇండి కూటమి చీలికలతో కొట్టుమిట్టాడుతోందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ఎంపీ దక్షిణ భారత ను విభజించాలని మాట్లాడుతున్నాడని, నారీ శక్తి కి ప్రోత్సాహించేలా ప్రసంగం ఉందన్నారు లక్ష్మణ్. అంతేకాకుండా.. మోడీకి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రసంశలను తట్టుకోలేక పోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ యాత్ర భారత్ జోడో చేస్తుంటే… -
IND vs ENG: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే..!
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. కాగా.. ఆట ముగిసే సమయానికి క్రీజులో క్రావ్లే (29), రెహాన్ అహ్మద్(9) పరుగులతో ఉన్నారు. ఓపెనర్ బెన్ డకెట్ వికెట్‌ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్… -
Minister Venu: అన్నయ్య మూసేస్తే తమ్ముడొచ్చాడు.. మంత్రి తీవ్ర విమర్శలు..
ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. కాగా అధికార వైసీపీ పార్టీ.. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. టీడీపీ, జనసేన కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. -
Top Headlines @5PM : టాప్ న్యూస్
పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదును అందజేశారు. రెండు తెలుగు… -
Ambati Rambabu: సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో.. చంద్రబాబు-పవన్ భేటీపై సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం కొత్త కాదని విమర్శించారు. సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుండి కలిసి పోటీ చేస్తాం అని చెప్తున్న వాళ్ళు.. ఇప్పటివరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారని మంత్రి ఆరోపించారు. మేం సిద్ధం అని జగన్ అంటుంటే.. టీడీపీ, జనసేన దగ్గర… -
IND vs ENG: ముగిసిన భారత్ రెండో ఇన్సింగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ 399
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈరోజు ఆటలో వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన శుభ్‌మాన్ గిల్ సెంచరీ (104) చేసి జట్టుకు ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ అయ్యర్ 29, రజత్ పాటిదర్, అక్షర్ పటేల్ 45, శ్రీకర్ భరత్… -
TDP-Janasena: ముగిసిన చంద్రబాబు – పవన్ భేటీ..
చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ తో భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన.. ఈ అంశంపై చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో.. జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి.. ఏఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపువకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు… -
Vodithala Pranav : బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్ ఫంక్షన్ హాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వొడితల ప్రణవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కొరకై స్థానిక ప్రజలకు చేరడం కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. పార్టీలో ప్రాధాన్యత అందరికీ ఉంటుందని, ప్రజా పాలన నచ్చి కౌన్సిలర్ల, సర్పంచులు చేరారని ఆయన తెలిపారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు ఉంటాయని, రానున్న ఎంపీ, సర్పంచ్,… -
CM Revanth Reddy : వారి పాపాలు కప్పిపుచ్చి.. కాంగ్రెస్ మీద నెట్టే పనిలో ఉన్నారు
KRMB కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. ప్రజలను గందరగోళానికి గురిచేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సర్కార్‌కు లొంగిపోయిందన్నారు. విభజన చట్టంలోని ప్రతీ అక్షరం నన్ను అడిగే రాశారని కేసీఆరే చెప్పారని, కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి… -
AP Assembly: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. కాగా.. ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!