ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. కాగా అధికార వైసీపీ పార్టీ.. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. టీడీపీ, జనసేన కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదును అందజేశారు. రెండు తెలుగు…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం కొత్త కాదని విమర్శించారు. సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుండి కలిసి పోటీ చేస్తాం అని చెప్తున్న వాళ్ళు.. ఇప్పటివరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారని మంత్రి ఆరోపించారు. మేం సిద్ధం అని జగన్ అంటుంటే.. టీడీపీ, జనసేన దగ్గర…
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈరోజు ఆటలో వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన శుభ్‌మాన్ గిల్ సెంచరీ (104) చేసి జట్టుకు ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ అయ్యర్ 29, రజత్ పాటిదర్, అక్షర్ పటేల్ 45, శ్రీకర్ భరత్…
చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ తో భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన.. ఈ అంశంపై చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో.. జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి.. ఏఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపువకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు…
జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్ ఫంక్షన్ హాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వొడితల ప్రణవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కొరకై స్థానిక ప్రజలకు చేరడం కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. పార్టీలో ప్రాధాన్యత అందరికీ ఉంటుందని, ప్రజా పాలన నచ్చి కౌన్సిలర్ల, సర్పంచులు చేరారని ఆయన తెలిపారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు ఉంటాయని, రానున్న ఎంపీ, సర్పంచ్,…
KRMB కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. ప్రజలను గందరగోళానికి గురిచేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సర్కార్‌కు లొంగిపోయిందన్నారు. విభజన చట్టంలోని ప్రతీ అక్షరం నన్ను అడిగే రాశారని కేసీఆరే చెప్పారని, కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి…
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. కాగా.. ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు.
రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసి విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బషీర్‌బాగ్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూకేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేయేశ్ రంజన్, సంస్థ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, సంస్థ అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన భూకేటాయింపులు, తర్వాత జరిగిన కేటాయింపుల పై…
వికారాబాద్ జిల్లా… చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పరిగి అసెంబీ కాన్సిస్టుయెన్సీ పూడురు మండలం దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వద్దని… దాన్ని వేరే దగ్గరికి మార్చాలని బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మించడం వల్ల 400 సంవత్సరాల పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవాలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం…