హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ లో పలు అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు దేవాదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆమెతో పాటు వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సవాల్ విసిరారు. మళ్ళీ నిజామాబాద్ లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు కొండా సురేఖ. నిన్న కవిత మాట్లాడుతూ ప్రభుత్వం పై…
నిన్న జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దళిత బంధు కోసం డబ్బులు తీసుకున్నారని ఆయన ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేసిన ఘటనపై ఆయన స్పందిస్తూ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న అందుకే నాపై ఇలా కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలిదశ ఉద్యమంలోనే పాల్గొన్నానని, 2002 లో కేసిఆర్…
టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదని.. ఈ చట్టంపై అడ్వకేట్స్ కొన్ని అభ్యంతరాలు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో త్వరితగతిన రీ సర్వే పూర్తి అవుతుందని ఆయన ప్రకటించారు. ఇంకా రూల్స్ తయారు చేయలేదు , అసెంబ్లీ చర్చించలేదని.. న్యాయవాదుల సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఉత్తరాంధ్రకు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింఙారావు గుడ్ న్యూస్ చెప్పారు. వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వేజోన్ నిర్మాణం జరుగుతుందని ఆయన ప్రకటించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆయన వెల్లడించారు.
కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారని ఆయన అన్నారు. కేశినేని నాని దెబ్బకు వైసీపీలో ఓ వికెట్ పడిందన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు..అలాంటి నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరంగా జరిగారని ఆరోపించారు.
విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. అనంత శర్మ(పూజారి )అనే వ్యక్తి ఫోన్ చేయడంతో రమణయ్య ఇంటి నుంచి కిందకి వచ్చినట్లు తెలిసింది.
విశాఖలో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. విశాఖలోని నేవల్ డాక్ యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను కేంద్ర మంత్రి జాతికి అంకితమిచ్చారు. నేవీ అవసరాల కోసం ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను ఉపయోగించనున్నారు.
విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ 336/6తో రెండోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 396 పరుగులకు మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడు గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా ఈరోజు ఉదయం అడవి పందిని పులి చంపి అడవి పంది మాంసాన్ని తిని పెద్దపులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల సంక్షేమానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. శుక్రవారం మార్కాపురం ఏఎంసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.