మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు నుంచి భారీ ర్యాలీగా జనసేన కార్యాలయానికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపు ఓటములు హుందాగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఒక దిగజారుడు పార్టీ. వెకిలి చేష్టలతో వికృతానందం పొందుతుందన్నారు. ఓడిన వాళ్లపై దుష్ప్రచారం చేయడం కుసంస్కారమన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగై పోయిందన్నారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేసామని రెండు నెలల్లోనే ప్రజలు బాధపడే దుస్థితికి కాంగ్రెస్ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన…
నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేరం జరిగిన తీరు పట్ల మంత్రి కాకాణికి అవగాహన లేదని, ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే నెల్లూరు కోర్టులో బ్యాగు చోరీకి గురైందని తెలిపారు.…
మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా నా తలరాత రాసింది జగన్మోహన్ రెడ్డి.. ఆయన బంటుగా వైసీపీ విజయం కోసం త్యాగానికి సిద్ధం అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీ తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా తాను సిద్దమని తెలిపారు. జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్ లో అమర్నాథ్ ఒకడు అని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం అని చెప్పారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ.. సీఎం…
వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు పడుతున్నాయన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. ఇవాళ ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ.. దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టేలా చర్యలు .. ప్రపంచంలోనే ఇండియాను 3వ స్థానానికి తీసుకెళ్లడానికి నిరంతర కృషి చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా దేశాభివృద్ధి కోసం శ్రమిస్తుందని, దేశ ప్రజలంతా మోడీ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశంలో రాబోయేది.. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ బీఆర్ఎస్ అవినీతి…
భారతదేశ టెలికాం సంస్థలో టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించిందని భారతదేశ టెలికాం సంస్థ సెక్రటరీ నీరజ్ మిట్టల్ అన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా భారతదేశంలోని అనేక ప్రముఖ పరిశోధన విద్య సంస్థలో భారతీయ టెలికాం సంస్థలోని అబ్రిడేషన్ పైన పరిశోధనలు జరుగుతున్నాయని.. పరిశోధనలు చేసే సంస్థలకు కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చామని ఆయన తెలిపారు.
ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో సమావేశమై.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలు అనాలోచితంగా విమర్శలు చేస్తున్నారని, ఇండి కూటమి చీలికలతో కొట్టుమిట్టాడుతోందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ఎంపీ దక్షిణ భారత ను విభజించాలని మాట్లాడుతున్నాడని, నారీ శక్తి కి ప్రోత్సాహించేలా ప్రసంగం ఉందన్నారు లక్ష్మణ్. అంతేకాకుండా.. మోడీకి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రసంశలను తట్టుకోలేక పోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ యాత్ర భారత్ జోడో చేస్తుంటే…
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. కాగా.. ఆట ముగిసే సమయానికి క్రీజులో క్రావ్లే (29), రెహాన్ అహ్మద్(9) పరుగులతో ఉన్నారు. ఓపెనర్ బెన్ డకెట్ వికెట్‌ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్…
ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. కాగా అధికార వైసీపీ పార్టీ.. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. టీడీపీ, జనసేన కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.