తాంసి మండలం చర్లపల్లి గ్రామం వద్ద సోమవారం టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో కండక్టర్‌తో సహా ఐదుగురికి గాయాలయ్యాయి. గ్రామ సమీపంలోని వంపు వద్ద వాహనం తాబేలు కావడంతో ముగ్గురు ప్రయాణికులు, బస్సు కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వంపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆప్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కండక్టర్ కూడా ఉన్నారు. గ్రామ సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పడంతో బోల్తా పడినట్లు పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Harish Rao : బీఆర్‌ఎస్ సర్కార్ ఎప్పుడు ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకోలేదు
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ దెహాత్ జిల్లా సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో వర్షం కురుస్తుండగా, వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి నీరున్న గొయ్యిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కాగా, కారులో మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని.. జెసిబి సహాయంతో కారును బయటకు తీశారు. ఇక, ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిన్నారులను స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం పంపించారు. ఆరుగురి మృదేహాలను పోలీసులు శవ పరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా సమయంలో జోరుగా వర్షం కురుస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కారు అదుపు తప్పడం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Rakul Preet Singh: థాయిలాండ్ లో రకుల్-జాకీ బ్యాచిలర్ పార్టీ..పిక్స్ వైరల్..