మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. 370 సీట్లు గెలుస్తాం అని బీజేపీ స్పష్టంగా చెప్తోంది... జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కాబట్టి బీజేపీ అలా అంటుందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్‌ను విభజించి ముక్కలు చేశామని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుంది.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, విదేశీ సంస్థలకు దేశాన్ని అమ్మడం గొప్ప విజయంగా బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఖూనీ చెయ్యడం కూడా గొప్ప…
మూత్రపిండాల మార్పిడి విషయంలో విప్లవాత్మకమైన ముందడుగుకు, గుణాత్మకమైన విధానాలకు మనదేశంలో శ్రీకారం చుడుతూ.. హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ వారు 'పి.కె.డి' అనే రిజిస్ట్రీ పద్ధతిని ప్రవేశపెడుతున్నారని స్టార్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం తెలియజేశారు. 'పి.కె.డి' అంటే - 'కిడ్నీ పెయిర్డ్ డొనేషన్' అని అర్థం. మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధితో బాధపడుతున్న లక్షలాది రోగులకు ఈ 'పి.కె.డి' రిజిస్ట్రీ పద్ధతి గొప్ప వరప్రసాదం కాగలదనీ వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే -…
ఐపీఎల్ 2024 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. దీని షెడ్యూల్‌కు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వెలువడనుంది. కాగా.. షెడ్యూల్ ప్రకటించకముందే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరం అయ్యాడు. ఎడమ చీలమండ గాయం కారణంగా ఐపీఎల్ 2024 నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. అయితే గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ వర్గాలు…
వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. ఇండోర్ కు చెందిన 28 ఏళ్ల వ్యక్తికి 2021లో ఉత్తరప్రదేశ్ కు చెందిన వైభవ్ శుక్లా అనే యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త విపరీతమైన ప్రేమగా మారింది. అయితే వైభవ్.. ఆ యువకుడిని సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలా అయితే సమాజంలో గౌరవంగా జీవించవచ్చని ఆ యువకుడికి చెప్పాడు. దీంతో బాధితుడు లింగమార్పిడి ఆపరేషన్‌తో స్త్రీగా మారాడు. ఇప్పటి వరకు బాగానే…
మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎక్కడ యుద్దం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు కి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాలలో పోటీకి సిద్దమని, జనసేన ఎన్ని చోట్ల యుద్దానికి…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు. పొత్తులో ఉండి నేతలతో చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారని, పవన్ లాంటి అనైతికమైన రాజకీయవేత్త దేశంలోనే లేరని ఆయన విమర్శలు గుప్పించారు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్నటి దాక ఓట్లు కొనకూడదని చేగువేరాలాగ కాకమ్మ కథలు చెప్పాడని,…
ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సీరియస్ కామెంట్లు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పని చేయాలన్నారు. ఓ రాజకీయ పార్టీకో.. పొలిటికల్ లీడర్లకు అధికారులు అనుకూలంగా ఉండకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులుగా ఉన్న వాళ్లు బాధ్యతతో వ్యవహరించాలని, అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలి కానీ.. పార్టీ పట్ల కాదనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు పురందేశ్వరి. తప్పులు…
రష్యాలో చాలా కాలంగా నివసిస్తున్న ఓ అమెరికన్ డ్యాన్సర్‌ను దేశద్రోహం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సంస్థకు 51 డాలర్లు (దాదాపు 4 వేల రూపాయలు) విరాళంగా ఇచ్చినట్లు ఆ మహిళపై ఆరోపణలు వచ్చాయి.
Byjus : కొన్నేళ్లుగా ప్రముఖ ఎడ్టెక్ సంస్థ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది. ఇప్పటికే అద్దెలు కట్టలేక పలు ఆఫీసుల్ని ఖాళీ చేస్తోంది. కొన్నాళ్ల క్రితం మరో పెద్ద ఆఫీసు ఖాళీ చేసేసింది.
TDP నేత మన్నెం వెంకటరమణ కన్నుమూత టీడీపీ నేత, ఎన్నారై మన్నెం వెంకటరమణ (53) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే.. అమెరికాలోని న్యూ…