కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందంటే ఇదేనేమో.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. తన పని తాను చేసుకుంటున్న ఏనుగును.. ఓ అమ్మాయి వచ్చి రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో లైక్స్, వ్యూస్ రావాలంటే మరీ వినూత్నంగా ఆలోచించాల్సిన పనిలేదు. కొంతమంది వికృత చేష్టలు వల్ల కూడా లక్షల్లో లైక్‌లు, వ్యూలు వస్తున్నాయి. ఇలాంటి చర్యల ద్వారా ప్రజలు శాంతియుతంగా ఉన్న జంతువులకు భంగం కలిగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
Read Also: Assam: బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ముస్లిం వివాహ చట్టం రద్దు..
ఈ వీడియాలో ఓ యువతి ఏనుగుతో ఫొటోలు, వీడియో తీసుకునేందుకు ప్రయత్నించింది. ఏనుగు గడ్డి తినడం చూసిన యువతి.. ఏనుగుతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేద్దామని ఊహించింది. అందుకోసమని ఏనుగు దగ్గరకు కెమెరా పట్టుకుని వచ్చింది. ఆ సమయంలో ఏనుగు ప్రశాంతంగా గడ్డి తింటుండగా.. ఒక్కసారి అమ్మాయి దగ్గరికి రావడం చూసి రెచ్చిపోయింది.
Read Also: New Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు..
ఆ అమ్మాయి చేష్టలు చూసి ఏనుగు ఒక్కసారిగా గర్జించింది. కోపంగా ఆ అమ్మాయిని తొండంతో బలంగా తోసింది. వెంటనే ఆ అమ్మాయి దూరంగా పడిపోతుంది. ఒక్కసారిగా బయపడ్డ ఆమె పెద్దగా కేకలు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతేకాకుండా.. ఏనుగు దాడికి ఆ అమ్మాయి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ” జంతువులతో పిచ్చి పనులు చేస్తే, ఇలానే జరుగుతుంది.” అని అంటున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 17 మిలియన్లకు పైగా మంది వీక్షించారు.
Girl tries to make friends with an elephant and finds out pic.twitter.com/DD5jGR6qjk
— non aesthetic things (@PicturesFoIder) February 21, 2024