మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. కొల్లు రవీంద్ర ఓటమి భయంతో సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. పాపపు సొమ్ముతో చండి యాగాలు, పూజలు చేయడం కాదని.. 3 స్తంభాల సెంటర్ నుంచి బైపాస్ రోడ్లో పేదలకు స్థలాలు ఇచ్చింది నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి అని ఆయన పేర్కొన్నారు.
బీసీలు అధికంగా ఉండే ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ను తెలుగుదేశం పార్టీ బీసీ వర్గానికి కేటాయించాలని బీసీ ఐక్యవేదిక నిర్వహించిన బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానించారు. మాచాని సోమప్ప మెమోరియల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి 30 కులాల బీసీ నాయకులు భారీ ఎత్తులో పాల్గొన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.
మేడారంలో సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మంత్రులతో కలిసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు ముఖ్యమంత్రి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ 75 రోజుల పాలన గురించి వివరించారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమై.. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చించింది. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పెన్షన్ బకాయిలు, ఇతర డిమాండ్లపై చర్చించింది. నాలుగు అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.
Transfer of IAS: తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తమ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Medaram Jathara:ములుగు జిల్లా మేడారం మహాజాతరలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం మేడార జాతరకు వెళ్లిన గవర్నర్ సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంతేకాదు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోటా టోకెన్లు విడుదల చేయనున్నారు.
ఇంటర్ నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యా శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరంలో రూ. 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనార్టీ…
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టనుంచి కుంకుమ భరణి రూపంలో బయల్దేరి వచ్చిన సమ్మక్క.. గద్దెకు చేరుకుంది. సమ్మక్కను ప్రధాన పూజారి ప్రతిష్టించారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించే సమయంలో లైట్లు నిలిపివేశారు. మరోవైపు.. అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించే సమయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించడంతో భారీ ఎత్తున భక్తులు జై సమ్మక్క తల్లి-జై సారక్క తల్లి అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు…