Home
Telugu News
Telugu News News
-
IND vs ENG: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్ విజయానికి ఎన్ని పరుగులు కావాలంటే..?
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ 24, జైస్వాల్ 16 పరుగులతో ఉన్నారు. కాగా.. ఇంకా భారత్ విజయానికి 152 పరుగులు కావాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్లర్లు దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. -
Teegala Krishna Reddy: బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా..
లోక్ సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి హస్తం పార్టీలో చేరారు. తాజాగా.. బీఆర్ఎస్కు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. కృష్ణారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ తీగల అనితారెడ్డి రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్ధీన్, డిప్యూటీ మేయర్… -
Botsa Satyanarayana: అమిత్‌షాను కలిసినా, అమితాబ్ బచ్చన్‌ను కలిసినా జగన్ గెలుపును ఆపలేరు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ-జనసేన తొలి జాబితాపై సెటైర్లు వేశారు. జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్ సామర్థ్యం అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. వాళ్లు అమిత్‌షాను కలిసినా, అమితాబ్ బచ్చన్‌ను కలిసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. -
BJP: తెలంగాణలో 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ..
పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్-కిషన్ రెడ్డి, కరీంనగర్-బండి సంజయ్, నిజామాబాద్-అర్వింద్, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం-డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్ లను అభ్యర్థులుగా ఖరారు చేసింది. -
IND vs ENG: ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన భారత్.. ఇండియా టార్గెట్ ఎంతంటే.. ?
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జరుగుతుంది. అందులో భాగంగా ఇంగ్లండ్‌కు టీమిండియా గట్టి షాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ టార్గెట్ 192 పరుగులు చేయాల్సి ఉంది. కాగా.. భారత్ బౌలర్లు ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను కోలుకోలేని దెబ్బ తీశారు. భారత్ బౌలింగ్ లో అశ్విన్ 5 వికెట్లు తీసి చెలరేగాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 4,… -
Chicken Prices: తగ్గేదే లే.. చుక్కల్లో చికెన్ ధరలు
చికెన్ ధర చూస్తే కెవ్వుమనాల్సిందే. అంతకంతకూ ధర కొండెక్కుతుంది. చికెన్ రేటు అమాంతం పెరగడంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు. ఇప్పుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. దీంతో చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. కోడి ధరలు చూసి సామన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఒక్కరోజులోనే చికెన్ ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. బుధ, గురు వారాల్లో… -
Chandrababu: చంద్రబాబుతో ఆలపాటి రాజా భేటీ.. రాజకీయ భవిష్యత్‌కు హామీ!
టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా చంద్రబాబు ఆయన నివాసంలో కలిశారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజాను ఇంటికి పిలిపించుకుని చంద్రబాబు ఆయనతో మాట్లాడారు. -
Jaggareddy: బీఆర్ఎస్, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుంది..
బీఆర్ఎస్, బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధాంతాలు చెప్పే పార్టీలు డూప్లికేట్ పార్టీలు అని విమర్శించారు. మాట మీద నిలబడి సెక్యులర్ మాటకు కట్టుబడి ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి సిద్ధాంతాలు లేవని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారి ఒప్పందంలోనే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కొత్త నాటకంకు రెండు… -
Chellluboina Venugopal: టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితాపై మంత్రి చెల్లుబోయిన సంచలన వ్యాఖ్యలు
టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ల కేటాయింపుపై రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని ఆరోపించారు. -
Telangana Media Academy: మీడియా అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం.హనుమంత రావు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతేకాకుండా.. గతంలో విశాలాంధ్ర పత్రికకు సంపాదకులుగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం ప్రజాపక్షం 'ఎడిటర్' గా ఉన్నారు. కాగా.. అంతకుముందు అల్లం నారాయణ మీడియా…
తాజావార్తలు
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!