పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తులం ఎంతంటే? మహిళలకు షాకింగ్ న్యూస్ మళ్లీ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి… నేడు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి… ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు పెరిగి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,750 గా ఉంది.. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి .. కిలో…
ఏపీలో రాజకీయం రోజుకో ములుపు తిరుగుతోంది. రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముదురుతున్న టికెట్ వార్ జరుగుతోంది. పవన్ పర్యటన తర్వాత జిల్లాలో టీడీపీ – జనసేన నేతల మధ్య టికెట్ ఫైట్ పెరిగింది. రేపు జనసేన లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేరనున్నారు. అయితే.. కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం జనసేన టికెట్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే… నర్సాపురంలో ఇప్పటికే జనసేన ఇన్చార్జ్ బొమ్మిడి నాయకర్, టీడీపీ…
నేడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలోని తాపీ కక్రాపర్‌లో 22,500 కోట్ల రూపాయలతో నిర్మించిన రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు.
భారత నావికాదళం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఫ్లాగ్షిప్ నావికా విన్యాసమైన మిలాన్ 2024 12వ ఎడిషన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పు నౌకాదళ కమాండ్ బేస్‌లో మిలాన్ గ్రామాన్ని కూడా ఆయన ప్రారంభించారు. “శాంతి పరిరక్షణలో సాయుధ దళాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మా చారిత్రక అనుభవం తెలియజేస్తుంది. ఇది నిరోధం, సంఘర్షణ నివారణ వంటి భావనలు,అభ్యాసాలలో కనిపిస్తుంది, ”అని మిలన్ నౌకాదళ వ్యాయామం యొక్క 12వ ఎడిషన్‌లో…
మేడారం మహా జాతరలో తొలి ఘట్టం నిర్విఘ్నంగా పూర్తైంది. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ నిన్న (బుధవారం) అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించారు. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం ఇవాళ జరగనుంది.
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతమైన జాతీయ రహదాలను నిర్మించింది.. అలాగే రైల్వేను కూడా అభివృద్ధి చేస్తుందన్నారు. మరోవైపు.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు ప్రకటించిందని తెలిపారు. ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యంతో పాటు పేదవాడి…
ఈనెల 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో జరుగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తొలిసారి రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రాబోయే వారం రోజుల్లో 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. వచ్చే నెల 15 వ తేదీలోపు రైతులందరికి రైతుబందు అందిస్తాం. రైతులను రుణవిముక్తి చేసేందుకు త్వరలో 2 లక్షల రుణమాపీ…
పార్లమెంట్ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం కోస్గి సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. భారీ మెజార్టీతో వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కొడంగల్ లో 50 వేలు తగ్గకుండా ఆపై మెజార్టీ ఇవ్వాలని కోరారు.
సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్దం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం…