ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మితమైన ఎన్టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేస్తారు.
ఏపీలో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడును పెంచాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశాయి. ఇవాళ టీడీపీ - జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు - పవన్ విడుదల చేయనున్నారు.
ఏపీలో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడును పెంచాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశాయి. దీనిని రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీల అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే లాస్య మృతిపై కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ తెలిపారు. ఉదయం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని.. డ్రైవర్ ఆకాష్ అకస్మాత్తుగా నిద్రమత్తులోకి జారడం వల్ల డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడని వెల్లడించారు.
కారు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు.
కారు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. పటాన్ చెరు పోలీస్‌స్టేషన్‌లో లాస్యనందిత సోదరి నివేదిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని.. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మీద ఏదో ఒక నింద వేయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు.