టీడీపీ – జనసేన మొదటి లిస్ట్‌పై నేతల అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. అవనిగడ్డ సీటు పెండింగ్‌లో పెట్టింది టీడీపీ అధిష్టానం. టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఫేస్ బుక్ పోస్ట్ లో టీడీపీ పై, రాజకీయాలపై నైరాశ్యం వ్యాఖ్యలు చేశారు. అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారని ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో.. పెడన సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ చంద్రబాబు, పవన్ ను కలిసిన తర్వాత నిర్ణయం ఉంటుందని ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. మొదటి లిస్ట్ లో నా పేరు లేకపోవటంతో మహదానందంగా ఉన్నాన్నారు.
Electricity Demand: ఫిబ్రవరిలో గతేడాదితో పోల్చితే 6.9శాతం పెరిగిన విద్యుత్ డిమాండ్
పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలా స్వేచ్చగా పొందినట్టు ఉందని, కార్యకర్తలు, నాయకులు ఇది గమనించి వ్యవహరించండని ఆయన పేర్కొన్నారు. నేను పదవుల కోసం పుట్టలేదని, పదవులు వచ్చినపుడు ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశాను తప్ప దొచుకొలేదన్నారు. రాజకీయాలు మారిపోయాయని, డబ్బు రాజకీయాలకు ప్రధానం అయిందన్నారు బుద్ధ ప్రసాద్. ఓటరును కొనుగోలు వస్తువు గా రాజకీయ పక్షాలు భావిస్తున్న తరుణంలో ధనవంతుల కోసం అన్వేషిస్తున్నారని, నాలాంటి వాడు ఎన్నికల్లో నిలబడాలని భావించటం సమంజసం కూడా కాదన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన నుంచి పోటీ చేసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. అయితే.. ఈ జాబితాలో 24 సీట్లు జనసేన నేతలకు కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు తక్కువ సీట్లు కేటాయించారనే భావన జనసైనికుల్లోనూ మెదులుతోంది. దీంతో ఇరు వర్గాల నేతలు అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. దీంతో.. కొందరు పార్టీలకు రాజీనామా చేసేందుకు నిర్ణయించుకుంటుంటే.. మరి కొందరు తమ భవిష్యత్ కార్యచరణకోసం ప్లాన్ చేసుకుంటున్నారు.
Sudarshan Setu : దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జిని నేడు జాతికి అంకితం ఇవ్వనున్న మోడీ