గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
బంగారం కొనాలని అనుకొనేవారికి శుభవార్త.. నిన్నటి ధరలే ఈరోజు కూడా కొనసాగుతున్నాయి.. మార్కెట్ లో వెండి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈరోజు మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,720 గా ఉంది. వెండి కిలో రూ.74,400 లుగా ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,940, 24 క్యారెట్ల ధర రూ.63,210, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,640 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,870 గా ఉంది. అదే విధంగా కకోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది.. మిగిలిన అన్ని నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
కుక్కను తప్పించబోయి ఢీకొట్టిన సీఎం కాన్వాయ్.. పలువురికి గాయాలు
లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ కంటే ముందు వెళ్తున్న యాంటీ డెమో వాహనం ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా ఓ కుక్క కారు ముందుకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసులు, ఆరుగురు పౌరులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ నుండి విమానంలో తిరిగి వచ్చి విమానాశ్రయం నుండి తన నివాసానికి వెళ్తున్నారు. అదే సమయంలో అతని కాన్వాయ్ ముందు నడుస్తున్న వాహనం యాంటీ-డెమో రహదారిని తనిఖీ చేస్తోంది. అర్జున్‌గంజ్ ప్రాంతంలోని మారి మాతా గుడి దగ్గర నుంచి కారు వెళ్తుండగా అకస్మాత్తుగా దారిలో ఓ కుక్క అడ్డు వచ్చింది. కుక్కను కాపాడే ప్రయత్నంలో ఉండగా వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వాహనాల్లో కూర్చున్న పోలీసులు, పౌరులు గాయపడ్డారు.
మార్చి 1 నుండి బెంగాల్‌లో 100 కంపెనీల సెంట్రల్ ఫోర్స్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ బృందం మొత్తం ఇంకా పశ్చిమ బెంగాల్‌కు చేరుకోలేదు. అయితే ఎన్నికలకు ముందు హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున మార్చి 1 నుండి పశ్చిమ బెంగాల్‌లో 100 కంపెనీల సెంట్రల్ ఫోర్స్‌ని మోహరిస్తారు. ఆ తర్వాత మార్చి 7న మరో 50 కంపెనీ బలగాలు రానున్నాయి. ఈ విధంగా మార్చి మొదటి వారంలో 150 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్ చేరుకోనున్నాయి. రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏరియా డామినేషన్ కు శ్రీకారం చుట్టనున్నట్లు అందుతున్న సమాచారం. ఎన్నికల ప్రకటనకు ముందు ఇంతగా కేంద్ర బలగాలు గతంలో ఎన్నడూ రాలేదు. నిస్సందేహంగా ఎన్నికల సంఘం ఈ చర్య అపూర్వమని రాజకీయ నిపుణులు అంటున్నారు.
నేడు ఏపీలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్షను నేడు నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్ పరీక్షలో పాల్గొనాలని భావిస్తున్న అన్ని నమోదిత అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దేశించిన APPSC గ్రూప్ 2 పరీక్ష మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. కమిషన్. వారు తప్పనిసరిగా APPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్ మరియు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్ యొక్క హార్డ్ కాపీని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి. పరీక్ష ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో గ్రూప్-2 రాత పరీక్షలు(APPSC Group 2 Exam ) జరుగనున్నాయని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.3లక్షలు.. 3000శాతం రాబడి ఇచ్చిన షేర్ ఏదో తెలుసా ?
నిపుణులు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులకు మంచి పెట్టుబడులు ఎక్కువ కాలం ఉంచాలని ఎల్లప్పుడూ సలహా ఇస్తారు. ఇది దీర్ఘకాలంలో మరింత సంపదను సృష్టించగలదు. ఏజిస్ లాజిస్టిక్ పొజిషనల్ ఇన్వెస్టర్ల విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. గత 10 ఏళ్లలో కంపెనీ షేర్ల ధరలు 3000 శాతం పెరిగాయి.
ఒక ఇన్వెస్టర్ 10 సంవత్సరాల క్రితం ఏజిస్ లాజిస్టిక్‌లో రూ. 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం అతని డబ్బు రూ.3 లక్షలకు పెరిగింది. అంటే, ఈ కాలంలో పొజిషనల్ ఇన్వెస్టర్లు 3000 శాతం లాభపడ్డారు.గత ఒక నెలలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ధరలు 15 శాతం పెరిగాయి. ఆర్నెళ్ళ పాటు షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులు ఇప్పటివరకు 18 శాతం లాభం పొందవచ్చు.
రూ.2000కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. పరారీలో సినీ నిర్మాత
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) హెడ్‌క్వార్టర్స్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌తో కలిసి సంయుక్త ఆపరేషన్‌లో పెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు పేర్కొంది. ఈ ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 50 కిలోల సూడోపెడ్రిన్ రసాయనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సిబి అధికారులు శనివారం తెలిపారు. అరెస్టయిన ముగ్గురు నిందితులు తమిళనాడు వాసులు. డ్రగ్ నెట్‌వర్క్ భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలో విస్తరించి ఉందని ఎన్‌సిబి ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఢిల్లీలో ముగ్గురిని అరెస్టు చేసి 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మెథాంఫెటమైన్ తయారీలో సూడోఎఫెడ్రిన్ ఉపయోగించబడుతుంది.
బ్రాండెడ్ ముసుగులో సాసిరకం సరుకు.. కాటేదాన్‌లో తయారీ, నాగారంలో నిల్వ
నగరంలోని వివిధ మార్కెట్లలో లభించే ముడిసరుకుతో నిత్యావసరాల నాసిరకం తయారీ విచ్ఛలవిడిగా సాగుతుంది. ఉత్తరాది నుంచి తీసుకొచ్చిన ప్రముఖ కంపెనీల పేర్లతో కూడిన బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు. నగర శివారులోని కిరాణా దుకాణాల ద్వారా బ్రాండెడ్ వస్తువుల పేర్లతో విక్రయాలు చేస్తుండటంతో.. అదే బ్రాండెడ్ అని భావించి ప్రజలు దానిని తీసుకుని అనారోగ్యాలకు గురవుతున్నారు. దీనిపై దృష్టి పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఘరానా ముఠా సాగిస్తున్న దందాను గుట్టు రట్టు చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశామని, వారి నుంచి రూ.2 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్.గిరిధర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.