మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప శనివారం రాత్రి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి రాజప్ప సురక్షితంగా బయటపడ్డాడు. శనివారం రాత్రి తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలిజాబితాలో పెద్దాపురం స్థానానికి ఎంపికైన చినరాజప్పకు మద్దతుగా పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ వ్యక్తి ఒక్కసారిగా అడ్డుకోవడంతో డ్రైవర్ సడన్ బ్రేక్స్ వేశాడు.
Sudarshan Setu : దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జిని నేడు జాతికి అంకితం ఇవ్వనున్న మోడీ
దీంతో కారు డివైడర్‌పై నుంచి దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతడిని కారులో నుంచి బయటకు తీశారు. అనంతరం మరో కారులో ప్రయాణించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియోలో దర్గా సెంటర్ వద్ద ఓ వ్యక్తి అకస్మాత్తుగా అడ్డురావడంతో డ్రైవర్ అతడ్ని తప్పించే క్రమంలో డివైడర్ పైకి ఎక్కించాడు. ప్రమాద సమయంలో కారులోనే ఉన్న చినరాజప్ప క్షేమంగా బయటపడ్డారు.
Botsa Satyanarayana : విజయనగరంలో పర్యటించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ