ఈ రోజుల్లో సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని జనాలు ఎంతటి దానికైనా తెగబడుతున్నారు. చివరకు చావు అంచుల వరకు కూడా వెళ్లడానికి సిద్ధమనే అంటున్నారు. కొందరేమో భయంకర వీడియోలు చేసి హైలెట్ కావడం కోసం చూస్తే, మరికొందరు మంచి కంటెంట్‌తో హృదయాలను గెలుచుకుంటున్నారు. మరికొందరేమో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశపూర్వకంగా అలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ వీడియోలో ఓ…
సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు. అతనికి చరిత్ర పుటల్లో ప్రత్యేక పేరుంది. తన ఆటతో అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. సచిన్ ను ఇండియాలో క్రికెట్ దేవుడిగా పిలుస్తారు. కాగా.. క్రికెట్ కు సచిన్ చేసిన సేవలకు భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది. ఇదిలా ఉంటే.. తన బ్యాట్ తో మొదటిసారి చరిత్ర సృష్టించిన రోజు ఈరోజు.. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2010 ఫిబ్రవరి 24న క్రికెట్ చరిత్రలో…
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సెగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ 11 సార్లు విజయం సాధించింది. సీపీఎం రెండుసార్లు, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైసీపీ, బీఆర్ఎస్…
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకల్లో మునిగితేలుతున్న.. బర్త్ డే బాయ్ పై రెస్టారెంట్ సిబ్బంది కత్తితో దాడి చేశారు. పితంపుర శివార్లలోని ఓ మాల్లో ఈ సంఘటన జరిగిది. 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. రెస్టారెంట్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచాడు.
సామాన్యుని గమ్యానికి చేర్చేది సైకిల్. సాధకుడుని విజయానికి చేర్చేది సైకిల్. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది సైకిల్. ఆరోగ్యమైన రాజకీయాలకు ఉజ్వల భవిష్యత్తుకు నమ్మకమైన సైకిల్. ఎమ్మిగనూరు నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు తోనే సాద్యం అని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా మాచాని సోమనాథ్ గారు ఎమ్మిగనూరు నుండి సైకిల్ యాత్ర ప్రారంభించి నందవరం మండలంలోని ముగతి, నందవరం, కనకవీడు, త్సళ్లకుడ్లుర్, తిమ్మాపురం లో ఇంటింటికి వెళ్లి టీడీపీ…
హర్యానాలోని పాల్వాల్‌లో దారుణం చోటు చేసుకుంది. తన తల్లి, సోదరిని వేధిస్తున్న ముగ్గురు దుర్మార్గులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 10వ తరగతి విద్యార్థిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. పల్వాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికొ తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థి లోకేష్‌గా గుర్తించారు.
ఉప్పల్‌లో ఈ నెల 21వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదర్శ్ నగర్ లో ఈ నెల 21 వ తేదీన సాయికుమార్ అనే వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నెల 22 వ తేదిన సాయి కుమార్ చనిపోయాడు. అయితే నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసుల మల్కాజ్గిరి డీసీపీ పద్మజ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన జరిగిన మర్డర్…
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. కాగా.. మొదట బ్యాంటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఈరోజు మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అయితే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 134 పరుగులు వెనుకంజలో ఉంది. ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్…
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గానికి బీఆర్ఎస్లో టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. ఆ పార్టీ నుంచి పలువురు నేతలు బరిలోకి దిగుతున్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో మల్కాజిగిరి ఒకటి, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎక్కువగా కోరుతున్నారు. పలువురి పేర్లు ప్రచారంలో ఉండగా, మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డికి టికెట్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన కుమారుడికి టికెట్‌పై పార్టీ తనకు హామీ ఇచ్చిందని చెప్పారు. కుటుంబ సభ్యులకు టికెట్…
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పరీక్షను రద్దు చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆరు నెలల్లో తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని సీఎం తెలిపారు. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల పవిత్రతలో రాజీపడే ప్రసక్తే లేదు.. యువత కష్టార్జితంతో ఆడుకున్న వారిని వదిలిపెట్టబోం. ఇలాంటి వికృత…