Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు-లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లాలోని బెంగుళూరు – మదనపల్లి హైవేలోని రూరల్ బార్లపల్లి వద్ద జరిగింది. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద కారును లారీ ఢీకొట్టింది. కారులో ఉన్నవారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.