టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎంఎస్ ధోని ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని పిలిచేవారు. ధోనీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలో (టీ20 ప్రపంచకప్ 2007, ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013) భారత్‌ను ఛాంపియన్‌గా మార్చాడు. అంతేకాకుండా ధోనీ సారథ్యంలో భారత జట్టు టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించింది.
ధోనీ 2020 సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ధోని ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. ధోనీ విజయవంతమైన క్రికెటర్‌గా మారడానికి ముందు అతను ఏం చేసేవాడో తెలుసా.. తాను క్రికెటర్ కాకముందు రైల్వేస్ లో జాబ్ వచ్చింది. ఖరగ్ పూర్ లో టిక్కెట్ కలెక్టర్ గా పనిచేసేవాడు. అయితే తన ప్రపంచం అది కాదు.. క్రికెటర్ కావాలన్నది ధోని కల. అతని కలను నెరవేర్చుకోవడానికి రైల్వే ఉద్యోగం వదిలి బ్యాట్ పట్టాడు. ఇప్పుడు ప్రపంచంలోనే ధోనీ అంటే మంచిపేరు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. భారత గ్రేట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తొలి ఉద్యోగ నియామక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ అభిమానులు కూడా దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
The first appointment letter of MS Dhoni. (JioCinema). pic.twitter.com/nrr53fDbhB
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
Threat Calls: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడికి బెదిరింపు కాల్స్
రాంచీలో జన్మించిన ధోని.. డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు గోల్డెన్ డక్‌తో ఔట్ అయ్యాడు. అయినప్పటికీ, ధోని పట్టు వదలలేదు. విశాఖపట్నంలో పాకిస్తాన్‌తో జరిగిన తన ఐదవ వన్డేలో 148 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన మొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. ఆ వెంటనే ధోనీ టీమిండియా కెప్టెన్‌గా మారాడు. ధోనీ సారథ్యంలో 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.
ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఇప్పటికీ లీగ్ క్రికెట్‌లో చురుకుగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ధోని మరోసారి CSKకి కమాండ్‌గా కనిపించనున్నాడు. గతేడాది ధోనీ సారథ్యంలో సీఎస్‌కే ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.