1. నేడు ఏపీలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష. ఉదయం 10.30 నుంచి మధ్యా్హ్నం 1 గంట వరకు పరీక్ష. గ్రూప్-2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు. ఏపీ వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్-2 పరీక్ష. గ్రూప్-2 కోసం ఏపీ వ్యాప్తంగా 1,327 పరీక్ష కేంద్రాలు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు. 2. నేడు కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ప్రారంభం. నేడు యానం ప్రభుత్వ ఆస్పత్రిలో జిప్మర్ మల్టీ స్పెషాలిటీ యూనిట్ ప్రారంభం.…
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం జాతరగా ప్రసిద్ధి చెందిన గిరిజన కుంభమేళా.. సమ్మక్క సారలమ్మ జాతర శనివారం ముగియడంతో లక్షలాది మంది గిరిజన భక్తులు గిరిజనుల అమ్మవారిని దర్శించుకుని తమతమ గ్రామాలకు, గ్రామాలకు బయలుదేరారు. వెర్మిలియన్ పేటికను తిరిగి చిలుకలగుట్టకు తీసుకువెళ్లి తదుపరి జాతర వరకు అక్కడే ఉంచడంతో అమ్మవారి “తల్లుల వనప్రవేశం” (అడవిలోకి ప్రవేశం)తో జాతర ముగిసింది. సమ్మక్క దేవిని చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును…
ఎక్కువ మంది మహిళలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా రాష్ట్రంలో తొలిసారిగా జిల్లా మహిళా హాస్టళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కేంద్ర ప్రాయోజిత పథకం అయిన ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (PM ఉష) కింద మహిళల కోసం 11 జిల్లా హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్, కామారెడ్డి, హన్మకొండ, నల్గొండ, భద్రాద్రి…
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు. కాగా.. డాక్టర్ కైలాష్ రాఠీగా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు నాసిక్ పంచవటిలోని సుయోగ్ హాస్పిటల్లో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఢిల్లీలో విద్యార్థి హత్య సంచలనం రేపుతుంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థి హత్య చేశాడు. అందుకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల లోపల ఏదో చిన్న సమస్యపై వారిద్దరు గొడవ పడ్డారని.. దీంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని ముఖంపై కొట్టాడని పోలీసులు…
మీ తలపై తెల్ల వెంట్రుకలు కనిపిస్తే వెంటనే పార్లర్‌కు పరిగెత్తుతారు. లేదంటే కిరాణం షాపులో దొరికే క్రీమ్ ను తెచ్చుకుని ఇంట్లోనే వేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల వరకే జుట్టు నల్లగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. వాటిలో ఉండే రసాయనాలు చర్మంపై చెడు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల కొంతమందికి చర్మంపై దురద రావడం లాంటిది ఏర్పడుతుంది. అలాంటప్పుడు వీటిని ఉపయోగించకుండా.. ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని…
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 షూటింగ్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తనకు వడ్డించిన ఆహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెట్లో ఉన్న వ్యక్తులపై మండిపడ్డాడు. వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలో చీలమండ గాయం బారిన పడిన పాండ్యా.. టోర్నీ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆటకు దూరంగా ఉంటూ, తన సోదరుడు కృనాల్, సహచరుడు ఇషాన్ కిషన్(ముంబై ఇండియన్స్)తో…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావుని ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు సంబరాలు చేసుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు శనివారం ఉదయం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉంగుటూరు మండలం పొనుకుమాడులోని శ్రీ గంగా సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో…
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపా దాస్‌మున్షీ తదితరులతో చర్చించే అవకాశం…
ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి…