Threat Calls: ఇంటర్నేషనల్ నంబర్స్‌తో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా ఫోన్ చేసి దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించినట్లు తెలిసింది. సింగపూర్ నుండి కాల్స్ వచ్చినట్లు వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. తరువాత మరో రెండు నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
రంజన్ అనే పేరుతో వున్న వ్యక్తి తనకు ఫోన్ చేసినట్లు వెలగపూడి తెలిపారు. శనివారం రాత్రి 8:30 నుండి 11: గంటల మధ్యలో తనకు కాల్ చేసి చంపేస్తానని బెదిరించారని ఆయన ఆధివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన రాజకీయ చరిత్రలో ఇటువంటి బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటిసారి ఆయన వెల్లడించారు. దీనిపై ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫోన్లు చేసి బెదిరించడం కాదు దమ్ముంటే ఎదురుగా రండి, తేల్చుకుందామంటూ అన్నారు. పోలీస్ వారు వీటిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం ప్రకటించిన టీడీపీ మొదటి జాబితాలో వెలగపూడి రామకృష్ణబాబు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.