హైదరాబాద్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ను ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి అంబర్-జాడే శాండర్సన్ సందర్శించారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని హెల్త్ కేర్ సంస్థల మధ్య స్కిల్లింగ్ రంగంలో సహకారానికి అవకాశాల కోసమే ఈ సందర్శన లక్ష్యం. ఈ సందర్భంగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వ వ్యూహాత్మక సలహాదారు (ఇండియా) డాక్టర్ పాడీ రామనాథన్.. ఆరోగ్య నైపుణ్యంలో సంభావ్య సహకార మార్గాలను వెల్లడించారు. అంతేకాకుండా.. పిల్లల సంరక్షణలో అత్యుత్తమ కేంద్రంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ను గుర్తించాలని సూచించారు.…
పలనాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరొకసారి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాచర్లలోని 28వ వార్డులో పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు కడుతున్నారు టీడీపీ నాయకులు.
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్మీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ హై కమాండ్‌కు పంపారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు, అసమ్మతి నేపథ్యంలో సీఎంను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఐదో విడత రైతు భరోసా నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34, 288 కోట్ల రూపాయలను చెల్లించామని ఆయన తెలిపారు.
చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం జన జాతర బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రణాళిక బద్దంగా పని చేస్తోంది ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ అధికారం వస్తుందా అని brs.. బీజేపీ కార్యకర్తలు చులకన చేశారని, ఆ కార్యకర్తలకు కూడా మనమే ఉచిత విద్యుత్.. సిలిండర్ ఇవ్వబోతున్నామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించండన్నారు.…
ఏపీలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఉద్యోగులకు జీఏడీ నోటీసులు ఇచ్చారు. ఉచిత వసతి సౌకర్యం పొందుతున్న ఉద్యోగులు అదనంగా వినియోగించిన కరెంట్ ఛార్జీలను చెల్లించాలని జీఏడీ లేఖ రాసింది. ఆ లేఖలో.. సెక్రటేరీయేట్, హెచ్ఓడీల ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి భవనాల్లో పరిమితికి మించి విద్యుత్ వాడుకున్నారని జీఏడీ ప్రస్తావించింది. రెయిన్ ట్రీ పార్క్, చిల్లపల్లి, నవులూరు, ఎమరాల్డ్ పార్క్, ఉండవల్లి, గొల్లపూడి వద్ద ఉద్యోగులకు కేటాయించిన అపార్టుమెంట్లలో అదనంగా విద్యుత్ వినియోగించుకున్నారని తెలిపింది.
కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసులు లేని వాళ్ళు.. వేధింపులు గురికాని కాంగ్రెస్ కార్యకర్తలు లేరన్నారు. ఇందిరమ్మ రాజ్యం ..…
టీడీపీ అధినేత చంద్రబాబును వివిధ జిల్లాలకు చెందిన ఆశావహులు, నేతలు కలిశారు. టీడీపీకి సంబంధించి టిక్కెట్ల ప్రకటన అనంతరం నేతలతో చంద్రబాబు వరుస భేటీలు అవుతున్నారు. ఈ క్రమంలో.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని వారికి సూచిస్తున్నారు. సీటు రాలేదు అంటే.. పార్టీ వద్దు అనుకున్నట్లు కాదని నేతలకు చెబుతున్నారు. సర్వేలు, సామాజిక సమీకరణలు, ప్రజల అభిప్రాయాల మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధినేత నేతలకు వివరించారు. ఈ క్రమంలో.. భేటీ అనంతరం పార్టీ అభ్యర్థుల…
టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షల మంది ఈసభకు హజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేస్తున్నాయి. బుధవారం జరగబోయే సభకు తెలుగుజన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై నుంచి నాయకులకు, క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.
రాష్ట్రములో ఆయిల్ పామ్ సాగు విస్తరణ కోసం, రాష్ట్రప్రభుత్వం జిల్లాల వారీగా, సాగుకు అనుకూల విస్తీర్ణాన్ని అంచనవేసి, 14 కంపెనీలతో ఒప్పందాలు అమలు చేసుకొని ముందుకు సాగుతున్నది. ముందుగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చూసుకొన్నట్లయితే కొన్ని కంపెనీలు ఇంకా వాటి లక్ష్యములో 20 కూడా సాధించక పోవడం పట్ల, మంత్రి వర్యులు తీవ్రంగా పరిగణించడం జరిగింది. రానున్న కాలములో ఇదేవిధముగా వారి ప్రగతి ఆశించస్థాయిలోనే లేకపోతే వారితో చేసుకున్న ఒప్పందాలను పునః సమీక్షించి, కఠిన నిర్ణయాలు తీసుకోవలసిందిగా…