చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆలయాలను జగన్ తిరిగి నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిలోని మహా మండపం, పాత మెట్ల వద్ద పునః నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు ఇన్ఛార్జ్లను మారుస్తోంది అధికార వైఎస్సార్సీపీ. తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను విడుదల చేసింది.
పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా 11,062 టీచర్ పోస్టులతో రేపు కొత్త నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ జారీ చేయనుంది. అయితే.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో జమ్మూకాశ్మీర్‌లో 43 వేల మంది భద్రతా బలగాలు బలయ్యారని తెలిపారు. పాకిస్తాన్ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగిలిందని అన్నారు. నేడు దేశంలో సమర్ధవంతమైన నాయకత్వం ఉందని.. ఈ రోజు పాకిస్తాన్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. మన సైనికుల్ని చంపిన ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే…
రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి, కుమురంభీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్, హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా బి.హెచ్.సహదేవ్‌రావును నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ…
హైదరాబాద్ లోని మైత్రివనంలో ఉన్న HMDAలో జరిగిన విజిలెన్స్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం నుంచి దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్.. గత ప్రభుత్వం ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా.. 4, 5వ అంతస్తులో రికార్డు సెక్షన్ నుంచి 51 అనుమతులకు సంబంధించి మాన్యువల్ ఫైల్స్ మాయం అయినట్లు నిర్ధారించారు. కాగా.. ఈ విషయాన్ని విజిలెన్స్ బృందం ఉన్నతాధికారులకు…
ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వీఆర్ఎస్కు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయమే వీఆర్ఎస్కు ఇంతియాజ్ అహ్మద్ అప్లై చేయగా.. కొద్ది గంటల్లోనే వీఆర్ఎస్కు సర్కార్ ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో ఇంతియాజ్ అహ్మద్ చేరనున్నట్లు తెలిసింది.
బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు పోవాలి.. క్షమాపణ చెప్పాలని అన్నారు. చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ పోయి చూసి.. ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆరోపించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.. బీఆర్ఎస్ వాళ్లకు అన్నీ చూపెట్టమని అని తెలిపారు. కాళేశ్వరంపై పెద్ద ఫ్రాడ్ చేసి.. ఉల్టా తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.
సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై రివ్యూ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి…
తమకు ఇష్టమైన ఆటగాళ్ల కోసం అభిమానులు ఏది చేయడానికైనా సిద్ధం అనే విధంగా ఉంటారు. క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరుగుతున్నా సరే.. అక్కడికి వెళ్లి సపోర్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా.. భారతీయులు ఏ కంట్రీలో మ్యాచ్ జరిగినా వెళ్తుంటారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ మధ్యలో కొందరు అభిమానులు తమకు ఇష్టమైన ఆటగాళ్ల పేర్లను ప్లకార్డులపై రాసి చూపిస్తారు. వారి మనసులో ఏదనుకుంటారో దానిని ప్లకార్డుపై వ్యక్తపరుస్తారు. నాకు ఈ ఆటగాడు అంటే ఇష్టం, ఇతని బ్యాటింగ్ అంటే…