వైసీపీలో కింద స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ల వరకూ అందరినీ గౌరవంగా చూసుకుంటామని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీలో ఆత్మగౌరవ సమస్య అనేది రాదు.. అలా ఏ చర్యలు ఉండవన్నారు.
ఎన్నికల వేళ.. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. వైసీపీలో అసంతృప్తులంతా ఎవరి దారి వారు చూసుకుంటుంటే.. టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ, జనసేనలో మొదలైన లుకలుకలను ఆయుధంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మెదక్ ఎంపీగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. అయితే.. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్లే అభ్యర్థి అని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టైం బాగా లేక ఓడిపోయా.. ఓడిపోయినా.. మా ప్రజలు రెస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఐదేళ్లు రెస్ట్ ఇచ్చారు.. కృతజ్ఞతలు అని అన్నారు. గాంధీ భవన్ లో పార్టీ కోసం పని చేస్తున్నానని తెలిపారు.
హైదరాబాద్ లోని యాకత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ఎంపీ డా. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బీజేపీ విజయ సంకల్ప యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇంకా 6 గ్యారెంటీలు ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు.…
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను వచ్చే నెల 13వ తేదీన జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. కి వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. కాగా.. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంలో పిటిషన్ వేసింది.. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని…
హైకోర్టులో స్టీలు ప్లాంటు అమ్మకుండా ఉండటానికి ఆర్డర్ తెచ్చానంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రెస్మీట్లో వెల్లడించారు. జస్టిస్ నరేంద్ర, జస్టిస్ న్యాపతిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్ళుగా స్టీల్ ప్లాంటు అమ్మకం జరగకూడదని పోరాడుతున్నానని కేఏ పాల్ అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగింది నిజమేనా కాదా..? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాహుల్ గాంధీ మేడిగడ్డ పోయారని.. ప్రజాధనం దుర్వినియోగం జరగొద్దని.. బాధ్యులపై చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డలో ఏం జరిగిందో చూపించారని అన్నారు.…
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్ను కలిసి ఏమైనా కావాలి అని అడిగితే బాలినేని అలిగాడు అంటారని.. ఎందుకు అలుగుతాను ప్రజల సమస్యలు పరిష్కరించుకోవటానికే కదా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది.. దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో సోదాలు చేసింది. గత ప్రభుత్వంలో అనుమతిచ్చిన ఫైల్స్ కావాలని విజిలెన్స్ అధికారులు కోరారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్ పలు వెంచర్లకు అనుమతించిన ఫైల్స్ పరిశీలించారు. హెచ్ఎండీఏ డైరెక్టర్ల అవినీతే లక్ష్యంగా సోదాలు జరిగినట్లు సమాచారం. కాగా.. ఉదయం 7 గంటల నుండి మైత్రివనంలోని 4వ అంతస్తు హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది.…