ప్రపంచంలో ఉండే మనుషులు వింత వింత రకాల అలర్జీలతో బాధపడుతున్నారు. కొంతమందికి దుమ్ము అలర్జీ, స్మెల్ అలర్జీ.. ఇలా రకరకాల అలర్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నీటి అలర్జీతో బాధపడటం మీరెప్పుడైనా విన్నారా.. ?. అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన ఓ యువతి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ యువతి తలస్నానం చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెబుతోంది. భరించలేని నొప్పితో పాటు శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయని తెలుపుతుంది.
చాలా మందిలో పాదాలు విపరీతంగా పొడిబారడం లేదా మడమలలో పగుళ్లు సమస్య ఉంటుంది. దీంతో.. పొడిబారిన చర్మంతో ఎక్కువసేపు పని చేయడం, నేలపై చెప్పులు లేకుండా నడవడం, ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడుతాయి. మీ పాదాల పగుళ్ళను నివారించడానికి అనేక హోం రెమడీస్ ను మీరు ఉపయోగించి ఉండవచ్చు. అయితే.. ఈ హోం రెమెడీస్ ను ఎంత ఉపయోగించినా, మీరు నేచురల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల మరింత ఉత్తమ ఫలితం లభిస్తుందంటారు. పాదాలు పగుళ్ళను నివారించి…
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. నున్న గ్రామంలో నూతనంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో అధికార ప్రభుత్వ నాయకులు తెలుగు భాషను కు.ని చేసి బూతులు మాట్లాడం బాధాకరం అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉద్యోగ కల్పనా కల్పించక పోగా యువతను తప్పు దారిలో నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని…
మనిషికి గుండె చాలా ముఖ్యమైనది. రక్తాన్ని పంపిణీ చేసే కీలకమైన వ్యవస్ధ గుండె. నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది. అలాంటి ముఖ్యమైన గుండె అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఈ రోజుల్లో చిన్న పెద్దా అని తేడా లేకుండా.. గుండె సమస్యలు వస్తున్నాయి. దానికి కారణం.. తినే ఆహారం, జీవనశైలి. అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?
అర్జున చెట్టు(తెల్ల మద్ది) నుంచి వచ్చేదే అర్జున బెరడు. ఈ బెరడు తెలుపు, ఎరుపు రంగులను కలగలసి ఉంటుంది. పూర్వ కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఎన్నో జబ్బులకు నివారణిగా అర్జున బెరడును వినియోగిస్తున్నారు. ఈ బెరడులో ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి. ముఖ్యంగా పోషకాలు, ఫైటోకెమికల్స్లో సమృద్ధిగా ఉంటాయి. అర్జున బెరడులో ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, ట్రైటెర్పెనాయిడ్స్, సపోనిన్లు వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. అర్జునోలిక్ యాసిడ్, గల్లిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్, β-సిటోస్టెరాల్…
ఇండియాలో క్రికెట్ అంటే ఇష్టపడని వారుండరు. ఒక్క మ్యాచ్ ను విడిచిపెట్టకుండా చూసే అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. క్రికెట్ ఆడే యువత కూడా చాలా మందే ఉన్నారు. సెలవులు వచ్చాయంటే చాలు బాల్, బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లో వాలిపోతారు. అంతేకాకుండా.. పార్కుల్లో, గల్లీల్లో కూడా క్రికెట్ ఆడే మంది చాలా మంది ఉంటారు. అయితే క్రికెట్ ఆడుతున్న వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు.
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు కోలిన్ మున్రో బాల్ బాయ్ ను ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొందరు రోజురోజు స్నానం చేస్తేనే వారి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటిది వారు సంవత్సరానికోసారి స్నానం చేస్తారంటా.. అయినా కానీ వారి దగ్గరి నుంచి సుగంధ వాసనే కానీ.. దుర్వాసన రాదంట. ఇంతకీ వారు ఎక్కడ, ఎవరు అనుకుంటున్నారా..! నమీబియాలో హింబా తెగకు చెందిన వారు ఏడాదికి ఒకసారి.. అది కూడా వారి పెళ్లిరోజున మాత్రమే స్నానం చేస్తారు. అయితే.. వారి ఆచారం ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఆ తెగకు చెందిన జనాలు చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి రాష్ట్రానికి సంబంధించిన పలు విజ్ఞప్తులను అందించారు. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తామన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ…