Telangana: విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6 వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండేది. బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి కొత్త ప్రభుత్వం గత రికార్డులను అధిగమించింది. విద్యుత్ సంస్థలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధిక డిమాండ్ ఉన్నపటికీ విద్యుత్ సంస్థలు దానికి తగిన విధంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి.
Read Also: Chit Fund Scam: చిట్టీల పేరుతో చీటింగ్.. తూప్రాన్‌లో ఫ్యామిలీ మిస్సింగ్ కేసులో ట్విస్ట్