Shock to Mallareddy Family: మేడ్చల్ మల్కారిగిరి జిల్లా దుండిగల్ పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఏరోనాటికల్, ఎం.ఎల్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన రెండు శాశ్వత భవనాలుస 6 తాత్కాలిక షెడ్లను కూల్చివేయడం ప్రారంభించారు అధికారులు.
Read Also: Demolitions: చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్.. అక్రమ నిర్మాణాల కూల్చివేత
చిన్న దామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదు నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ రోడ్లు, భవనాలు నిర్మించినట్లు అధికారులు గతంలో గుర్తించినట్లు తెలిసింది. తాజాగా కలెక్టర్ ఆదేశాలతో నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీనిని అడ్డుకునేందుకు కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకోగా.. వారికి అధికారులు సర్దిచెప్పారు.