కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగిన నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందన్నారు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇండియా కూటమిపై మాటలతో దాడి చేసారు. మహారాష్ట్రలోని జలగావ్లో జరిగిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ చేపట్టిన ‘రాహుల్ యాన్’ ప్రయోగం 19 సార్లు ఘోరంగా విఫలమైందని, 20వ ప్రయత్నానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
భారతీయులపై 'జాత్యహంకార' వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తైవాన్ మంత్రి క్షమాపణలు చెప్పారు. భారతీయ వలస కార్మికుల ప్రణాళికాబద్ధమైన రిక్రూట్మెంట్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు కార్మిక మంత్రి హ్సు మింగ్-చున్ మంగళవారం క్షమాపణలు చెప్పారు. కొందరు దీనిని "జాత్యహంకారం" అని విమర్శించారు.
వైట్ హౌస్ రేసులో సూపర్ మంగళవారం అతిపెద్ద రోజు. అధ్యక్ష ప్రాథమిక క్యాలెండర్లో అత్యధిక రాష్ట్రాలు ఓటు వేసే రోజు. మార్చి 5న, 16 యూఎస్ రాష్ట్రాలు, ఒక భూభాగంలోని ఓటర్లు అధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేశారు. ప్రెసిడెంట్ జో బైడెన్, అతని ముందున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ నవంబర్ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పోటీకి దిగుతున్నారు.
మెట్రోకు సంబంధించిన అనేక రకాలైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్విస్తే.. కొన్ని ఏడిపించేవి కూడా ఉంటాయి. ఇంకొన్నేమో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇటీవల.. బెంగళూరు మెట్రోలో జరిగిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఓ రైతు మురికి బట్టలు ధరించాడని మెట్రో ఎక్కకుండా ఆపారు. తర్వాత దీనిపై పెద్ద దుమారమే రేగింది. అదేవిధంగా.. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు కూడా తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలో కొంతమంది…
తమిళనాడులో శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల డ్రగ్స్ ను డీఆర్ఐ, ఇండియన్ కోస్ట్ గార్డ్ లు సీజ్ చేశారు. మండపం తీరంలో ఓ కంట్రీ బోటు నుంచి అక్రమంగా తరలిస్తున్న 99 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ అధికారి వెల్లడించారు. డ్రగ్స్ తో వెళ్తున్న పడవ శ్రీలంక వైపు వెళుతుండగా.. పక్కా సమాచారంతో అధికారులు బోటును వెంబడించి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు.
భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో ఐదో మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఎంతో ప్రత్యేకం. తన వందో టెస్టుపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. గమ్యం కంటే ఎక్కువ అని అశ్విన్ అన్నాడు.
మల్లె పూవు వాసన అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలకు జడలో మల్లెపూలు పెట్టుకోవడమంటే చాలా ఇష్టం. అయితే మల్లెలను దేవుడి కోసం కాకుండా.. జడలో పెట్టుకోవడానికి కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడవచ్చు. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే మల్లెపూలతో చేసిన టీని రోజూ తాగితే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. జాస్మిన్ టీని మల్లెపూలతో తయారు చేయరు.. కానీ ఇది మల్లె పువ్వుల సువాసనతో…
జార్ఖండ్లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ మంచి మనసు చాటుకుంది. భారత ప్రజలపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపింది. భారతదేశ ప్రజలు చాలా మంచి వారని స్పానిష్ పర్యాటకురాలు చెప్పారు. తాను నేరస్తులను తప్ప ఇక్కడి ప్రజలను నిందించను.. ఇక్కడి ప్రజలు తనను చాలా బాగా ఆదరించారని పేర్కొంది. వారు తన పట్ల దయతో ఉండటం వల్లనే.. భారత్ లో దాదాపు 20 వేల కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణించగలిగానని చెప్పింది. ఇదిలా ఉంటే..…
భారత కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ అభిమానులకు ఇదొక శుభవార్త. డిసెంబర్ 2022లో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్.. తొందరగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో పంత్ కోలుకుంటున్నాడు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే.. తను ఇటీవల వీధిలో పిల్లలతో కలిసి గోళీలు ఆడుతూ కనిపించాడు. పిల్లలతో కలిసి కింద కూర్చుంటూ గోళీలాట ఆడాడు. వారిలో కలిసి పోయి సీరియస్గా గోళీలకు గురి పెడుతూ ఆట కొనసాగించాడు. పిల్లలతో పోటీ పడుతూ…